Mahesh babu & Trivikram: మొత్తం మారిపోతున్నాయి

Mahesh babu & Trivikram Movie: వీళ్లిద్దరి కాంబో లో వస్తున్న సినిమా కి సంబంధించి స్టోరీ మారిపోయింది. దీంతో పాటు చాలా మార్పులు జరుగుతున్నాయి

Advertisement
Update: 2022-11-14 10:20 GMT

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే

మహేష్-త్రివిక్రమ్ సినిమా ఉంది. కానీ దానికి సంబంధించిన లెక్కలన్నీ మారిపోతాయి. మరీ ముఖ్యంగా కథతో సహా. అవును.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ షెడ్యూల్ లో కూడా పాల్గొన్నాడు మహేష్. ఇప్పుడీ సినిమాకు కథ మారిపోయింది. 


ఇంతకుముందు మహేష్ ఓకే చెప్పిన కథ కాకుండా, ఇప్పుడు మరో కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ మేరకు ఫుల్ నెరేషన్ ఇవ్వడం, మహేష్ ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. అయితే ఫస్ట్ షెడ్యూల్ వృధా కాదు. ఎందుకంటే, ఆ షెడ్యూల్ లో మహేష్ పై కేవలం యాక్షన్ బ్లాక్ మాత్రమే తీశారు. దాన్ని యథాతథంగా కొత్త కథకు కూడా వాడుకోవచ్చు.


అయితే కొత్త కథ రాకతో ఆర్టిస్టులు మారిపోతున్నారు. కొత్త పాత్రకు తగ్గట్టు ఆర్టిస్టుల్ని తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా త్రివిక్రమా ఆస్థాన కథానాయిక పూజాహెగ్డేను తప్ప, అందర్నీ మార్చేయాలని నిర్ణయించుకున్నారు. 


మరోవైపు మ్యూజిక్ డైరక్టర్ పై కూడా కీలక చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ ఛాయిస్ తమన్ ను మహేష్ వ్యతిరేకిస్తున్నాడట. అతడి స్థానంలో అనిరుధ్ ను తీసుకోవాలనేది మహేష్ సూచన. త్రివిక్రమ్ మాత్రం తమన్ కే కమిట్ అయి ఉన్నాడు. పాత కథకు సంబంధించి కొన్ని ట్యూన్స్ కూడా ఓకే చేయించుకున్నాడు. అవి పక్కనపెట్టి, ఇప్పుడు కొత్త కథతో తమన్ తో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాడు. మరి మహేష్ ను కాదని తమన్ ను త్రివిక్రమ్ కొనసాగించగలడా అనేది సమస్య.

Tags:    
Advertisement

Similar News