MM Keeravani: అలాంటి వాళ్లతో అస్సలు పనిచేయను

MM Keeravani: కొంతమందితో పనిచేయడం తనకు అస్సలు ఇష్టం లేదంటున్నారు ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి. వాళ్ల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.

Advertisement
Update: 2023-03-26 10:32 GMT

ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, మరోసారి తన మైండ్ సెట్ ను బయటపెట్టారు. ఏ దర్శకుడితో పడితే ఆ దర్శకుడితో తనకు వర్క్ చేయడం ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. పేర్లు బయటకు చెప్పనప్పటికీ, కొంతమందితో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదన్నారు.

"చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాను నేను. ఏడాదికి 70 సినిమాలు చేస్తున్న టైమ్ అది. అలాంటి టైమ్ లో కొంతమంది దర్శకులు చక్రవర్తిగారిని హింసించేవారు. ఇలా కావాలి, అలా కావాలి అంటూ ఇబ్బంది పెట్టేవారు. నిజానికి వాళ్లకు మ్యూజిక్ సెన్స్ లేదు, కనీసం సెన్స్ కూడా లేదు. తను మ్యూజిక్ డైరక్టర్ అయితే ఆ ముగ్గురు, నలుగురు దర్శకులతో పనిచేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. అలాంటి వాళ్లతో అస్సలు పనిచేయను. దాని బదులు రిటైర్ అయిపోవడం బెటర్."

అప్పట్నుంచి ఇప్పటివరకు ఆ నలుగురు దర్శకులతో తను వర్క్ చేయలేదని, కానీ దురదృష్టంకొద్దీ అలాంటి మైండ్ సెట్ ఉన్న మరికొందరితో వర్క్ చేయాల్సి వచ్చిందన్నారు కీరవాణి. కేవలం డబ్బు కోసం అలాంటి వాళ్లతో పనిచేశానని, ఇకపై అలాంటి పనులు కూడా చేయనని క్లారిటీ ఇచ్చారాయన.

Tags:    
Advertisement

Similar News