Ileana | బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా

Ileana - గోవా బ్యూటీ ఇలియానా తల్లయింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement
Update: 2023-08-06 15:32 GMT

గోవా బ్యూటీ ఇలియానా తల్లయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల ఒకటో తేదీన తనకు మగ బిడ్డ జన్మించినట్టు ఆమె ప్రకటించింది. కుమారుడికి కో ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టింది. అంతేకాదు, కొడుకు ఫొటోను కూడా బయటపెట్టింది.

‘‘మా డార్లింగ్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం. గుండె సంబరంతో నిండిపోయింది’’ అంటూ ట్వీట్ చేసింది గోవా బ్యూటీ. దీంతో అభిమానులు, స్నేహితులు, ఇలియానాకు పెద్దఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. ఆ తరువాత జులైలో తన ప్రియుడి ఫొటోలను కూడా షేర్ చేసింది. ‘దేవదాస్‌’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇలియానా ఆ తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించి టాప్ స్థానానికి చేరుకుంది. ఆపై బాలీవుడ్‌లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది.

అయితే బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, తన ప్రియుడి వివరాల్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. అసలు అతడ్ని పెళ్లి చేసుకుందా లేదా అనే విషయాన్ని కూడా ఆమె బయటపెట్టలేదు. గతంలో ఓ ఫారిన్ ఫొటోగ్రాఫర్ తో ఆమె సహజీవనం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News