Jr NTR: ఆ విషయం నా భార్యకంటే ముందు మీకే చెబుతా –ఎన్టీఆర్

Jr NTR Speech At Amigos Movie Event: అభిమానులంటే నటీనటులందరికీ అంత ఇష్టమని, వారు కూడా కొత్త సినిమాల అప్ డేట్ పేరుతో తమని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని సూచించారు.

Advertisement
Update: 2023-02-06 06:21 GMT

ఆ విషయం నా భార్యకంటే ముందు మీకే చెబుతా –ఎన్టీఆర్

“అప్ డేట్, అప్ డేట్.. ప్రతి రోజూ, ప్రతి గంటా అప్ డేట్ అడిగితే ఇవ్వడం చాలా కష్టం. అలా అభిమానులు అప్ డేట్ అడిగిన ప్రతి సారీ నిర్మాత, దర్శకుడు ఇబ్బంది పడతారు. మా గురించి కూడా కాస్త ఆలోచించండి. అప్ డేట్లు అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇది విన్నపం మాత్రమే.” అంటూ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులను వేడుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.

తనకు ఆరోగ్యం సహకరించకపోయినా అభిమానుల్ని కలుసుకోవాలనే ఉద్దేశంతోటే అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చానని చెప్పారు ఎన్టీఆర్. ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువగా మాట్లాడలేను అర్థం చేసుకోండి అంటూ ఆయన తన ప్రసంగం మొదలు పెట్టారు. అప్ డేట్ అంటూ ఒత్తిడి చేయడం సరికాదని అభిమానులకు చెప్పారు. ఒకవేళ నిజంగానే అప్ డేట్ ఉంటే.. ఇంట్లో భార్యకంటే ముందుగానే అభిమానులకే హీరోలు చెబుతారని అన్నారు. అభిమానులంటే నటీనటులందరికీ అంత ఇష్టమని, వారు కూడా కొత్త సినిమాల అప్ డేట్ పేరుతో తమని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని సూచించారు. అప్ డేట్స్ పై ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Full View


2022లో RRR విడుదల తర్వాత ఎన్టీఆర్ ఇంతవరకు కొత్త సినిమా ఊసు చెప్పలేదు. దీనిపై అభిమానుల అప్ డేట్ కావాలంటూ చాన్నాళ్లుగా అడుగుతున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఎన్టీఆర్ స్పందించారు. కొత్త సినిమా షూటింగ్ కి ఇదే నెలలో ముహూర్తం పెట్టామని, మార్చి 20 లేదా 21నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, 2024 ఏప్రిల్ 5 తన కొత్త సినిమా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News