Hunt movie OTT release date: 2 వారాలకే ఓటీటీలోకి హంట్

Hunt movie OTT release date: సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. ఈ మూవీ విడుదలైన 2 వారాల్లోనే OTT లోకి వచ్చేస్తుంది

Advertisement
Update: 2023-01-31 11:35 GMT

సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా హంట్. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. మరీ ముఖ్యంగా అందులో సుధీర్ బాబు చేసిన పాత్రపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అలా అన్ని విధాలుగా డిజాస్టర్ అయిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.


హంట్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. అలా విడుదలైన 2 వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోందన్నమాట. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వెంటనే ఓటీటీలోకి వచ్చేయడం కామన్. గతంలో రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఇలానే ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు హంట్ కూడా అదే బాట పట్టింది.


మహేష్ దర్శకత్వంలో తెరకెక్కింది హంట్ సినిమా. పదేళ్ల కిందట మలయాళంలో సూపర్ హిట్టయిన ముంబయి పోలీస్ అనే సినిమాకు రీమేక్ గా ఇది వచ్చింది. శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. అప్సర రాణి ఐటెంసాంగ్ లో మెరిసింది.

Tags:    
Advertisement

Similar News