Like Share & Subscribe: మనస్ఫూర్తిగా నవ్వుకునే సినిమా

Like Share & Subscribe సినిమా కచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతందని అంటున్నాడు హీరో సంతోష్ శోభన్. ఈ సినిమాలో మంచి కామెడీ ఉందని చెబుతున్నాడు.

Advertisement
Update: 2022-11-04 03:19 GMT

ఈరోజు థియేటర్లలోకి వచ్చింది లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా. ఈ సినిమా చూసి అంతా మనస్ఫూర్తిగా నవ్వుకుంటారని, అంత ఫన్ ఉంటుందని చెబుతున్నాడు హీరో సంతోష్ శోభన్. ఈ సినిమా ప్రచారానికి ఓ ముగింపు పలుకుతూ, రిలీజ్ కు ఒక్క రోజు ముందు మీడియాతో మాట్లాడిన ఈ హీరో.. కేవలం ఫన్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని తమ సినిమా చూడొద్దని, మంచి థ్రిల్ కూడా ఉంటుందని చెబుతున్నాడు.

"లైక్ షేర్ & సబ్స్క్రైబ్ కథ చాలా నచ్చింది. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీ అంటే ఇష్టం. ఆయన కథతో ఎక్ మినీ కథ చేశాను. ఆయనతో ఒక బాండింగ్ ఉంది. ఆయన టైమింగ్ నాకు తెలుసు. ఎక్ మినీ కథ తర్వాతే మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని అనుకున్నాం. లక్కీగా తొందరగా సెట్ అయింది. కథ చెప్పిన నెల రోజులకే షూటింగ్ కి వెళ్ళిపోయాం. ఆయన కూడా నన్ను నమ్మారు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మనస్పూర్తిగా నవ్వుకొని నవ్విస్తూ చేసిన సినిమా లైక్ షేర్ సబ్ స్క్రైబ్."

ఇలా తన సినిమాపై అంచనాలు పెంచేలా మాట్లాడాడు సంతోష్ శోభన్. తన ప్రతి సినిమాకు ప్రభాస్ ప్రచారం కల్పిస్తాడని, కానీ వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకు ప్రభాస్ ప్రచారం చేయలేకపోయాడని వెల్లడించాడు సంతోష్.

ఓ అభిమానిగా ప్రభాస్ ను కలిసేందుకు తను ఎప్పుడూ ఇష్టపడతానని, తమ సినిమాను ప్రభాస్ కు చూపించేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తానని అన్నాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. మరికాసేపట్లో రిజల్ట్ ఏంటనేది తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News