మరో 3 నెలల్లో పవన్ నుంచి టీజర్

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ కట్ రెడీ అవుతోంది. ఈ ఏడాది చివరికి రిలీజ్ చేయాలని ప్లాన్.

Advertisement
Update: 2022-09-25 10:16 GMT

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. ఇది హరిహర వీరమల్లు సినిమాకు చెందిన మేటర్. ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల కిందటే గ్లింప్స్ రిలీజైంది. తాజాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇదే ఊపులో హరిహర వీరమల్లు టీజర్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ లో హరిహర వీరమల్లు సినిమా టీజర్ ను లాంఛ్ చేయాలని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా డిసెంబర్ 31న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తే, సినిమాకు మరింత బజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది హరిహరవీరమల్లు సినిమా. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

చాన్నాళ్ల కిందటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ పవన్ బిజీగా ఉండడం, మధ్యలో కరోనా రావడంతో ఆలస్యమౌతూ వస్తోంది. ఇప్పటికీ ఈ సినిమాకు ఇంకా డేట్స్ ఇవ్వలేదు పవన్. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News