Masooda: ఆ ఛానెల్ గూటికి చేరిన హారర్ మూవీ

Masooda Movie: థియేటర్లలో అందర్నీ భయపెట్టిన ఈ హారర్ మూవీ, ఇప్పుడు బుల్లితెర వీక్షకుల్ని కూడా భయపెట్టడానికి రెడీ అయింది.

Advertisement
Update: 2023-01-02 05:30 GMT

Masooda Movie Review: ‘మసూద’ - హార్రర్ రివ్యూ 

హారర్ సినిమాలు చేయడం ఈజీ. తక్కువ సెటప్ తో, మినిమం బడ్జెట్ తో సినిమా పూర్తిచేయొచ్చు. కానీ ఇలాంటి సినిమాలతో సక్సెస్ కొట్టడం చాలా కష్టం. ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలకు అందుకోలేకపోయినా ఆడియన్స్ తిరస్కరిస్తారు. ఇలాంటి సినిమాలకు యావరేజ్ అనే టాక్ ఉండదు, అయితే హిట్, లేదంటే ఫట్.

ఇలాంటి రిస్కీ జానర్ లో సినిమా తీసి హిట్ కొట్టాడు దర్శకుడు రాహుల్ నక్కా. తిరువీర్, సంగీత, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ను దిల్ రాజు రిలీజ్ చేశాడు. సినిమా సూపర్ సక్సెస్ అయింది.

విడుదలకు ముందు ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా నాన్-థియేట్రికల్ డీల్ క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వడంతో జెమినీ టీవీ ముందుకొచ్చింది. మసూద శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసింది. త్వరలోనే ఈ సినిమా జెమినీ టీవీలో ప్రసారం కాబోతోంది.

ప్రశాంత్ విహారి అందించిన సంగీతం, ఆర్టిస్టుల హావభావాలు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఈమధ్య కాలంలో ఇంతలా భయపెట్టే సినిమా ఇంకోటి రాలేదంటే ఆశ్చర్యం లేదు. 

Tags:    
Advertisement

Similar News