Dhamki Movie: సూపర్ హిట్ సాంగ్ వీడియో వచ్చేసింది

Dhamki Movie: ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఓ సాంగ్ హిట్టయింది. అలా హిట్టయిన పాటకు సంబంధించి ఈరోజు ఫుల్ వీడియో రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2022-12-23 15:10 GMT

విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' లో టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన 'దాస్ కా ధమ్కీ' థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఫస్ట్ సింగిల్ 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల' లిరికల్ వీడియోకు భారీ స్పందన రావడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. తాజాగా వీడియో సాంగ్‌ని విడుదల చేయడం ద్వారా మేకర్స్ ఫుల్ ఫీస్ట్‌ను అందించారు. లియోన్ జేమ్స్ లైవ్లీ బీట్‌లతో పెప్పీ నంబర్‌ని స్కోర్ చేశాడు.

పాట కోసం విదేశీ లోకేషన్స్ లో షూట్ చేసిన స్టైలిష్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదిత్య ఆర్కేఎనర్జిటిక్ గా పాడగా, పూర్ణా చారి సాహిత్యం ఆకట్టుకుంది.

విశ్వక్ సేన్, నివేత పెతురాజ్ ఈ బీచ్‌సైడ్ సాంగ్‌లో ఆకట్టుకున్నారు. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చక్కగా ఉంది. పూర్తి వీడియో సాంగ్‌లో లీడ్ పెయిర్ అద్భుతమైన కెమిస్ట్రీతో 'ఆల్ మోస్ట్ పడిపోయిందే' చాలా ఆకర్షణీయంగా ఉంది.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది దాస్ కా ధమ్కీ.


Full View


Tags:    
Advertisement

Similar News