Circle Movie - దర్శకుడు నీలకంఠ నుంచి మరో సినిమా

Circle Movie - లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడు నీలకంఠ, మరో సినిమాను డైరక్ట్ చేశారు. అతడు తీసిన కొత్త సినిమా పేరు సర్కిల్.

Advertisement
Update: 2023-05-09 03:03 GMT

జాతీయ అవార్డ్ గ్రహీత డైరెక్టర్ నీలకంఠ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. గతంలో షో అనే ఫీచర్ ఫిల్మ్ తో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు నీలకంఠ. అలాగే విరోధి, షో చిత్రాలు ఇండియన్ పనోరమ లో కూడా సెలెక్ట్ అయ్యాయి.

ఇలాంటి చిత్రాల దర్శకుడు నీలకంఠ ఆ తర్వాత కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి 'సర్కిల్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

తాజాగా ఈ చిత్ర టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక మోడల్ ఫోటో కెమెరా లెన్స్ తిరుగుతుండగా.. దానితో పాటు ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో అనే ట్యాగ్ తో ఎండ్ అవుతుందీ మోషన్ పోస్టర్. చూస్తుంటే, ఇది మరోసారి నీలకంఠ తరహాలోనే సాగే వైవిధ్యమైన సినిమాగా కనిపిస్తోంది.

ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సర్కిల్ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. రిచా పనై హీరోయిన్. ఈ సమ్మర్ లోనే సినిమా థియేటర్లలోకి రానుంది.


Full View


Tags:    
Advertisement

Similar News