Agent Movie - నేను కూడా ఏజెంట్ నే అంటున్న డినో

Dino Morea Agent Movie - ఏజెంట్ మూవీలో తను కూడా ఏజెంట్ నే అంటున్నాడు డినో మోరియా.

Advertisement
Update: 2023-04-25 14:30 GMT

అఖిల్ హీరోగా నటించిన సినిమా ఏజెంట్. ఇందులో అఖిల్ ఏజెంట్ గా నటించాడు. డినో మారియో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో డినో కూడా ఏజెంట్ గానే కనిపిస్తాడంట.

"ఇందులో నేను ‘రా’ ఏజెంట్ పాత్ర పోషించాను. అయితే వ్యవస్థలో తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థ కు ఎదురుతిగి, వ్యవస్థపై పగ తీర్చుకునే పాత్ర ఇది. తను ప్రత్యేక శిక్షణ తీసుకున్న పవర్ ఫుల్ ఏజెంట్. కానీ తనకు జరిగిన ద్రోహం కారణంగా ఈవిల్ గా మారిపోతాడు. తనలో చాలా మ్యాడ్ నెస్ వుంటుంది. సురేందర్ రెడ్డి గారు ఈ పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నా పాత్రలో చాలా ఎమోషన్, డ్రామా ఉంటుంది."

ఇలా సినిమాలో తను కూడా ఏజెంట్ నే అనే విషయాన్ని బయటపెట్టాడు డినో మోరియా. అంటే.. ఈ సినిమాలో ఓ గుడ్ ఏజెంట్ కు, బ్యాడ్ ఏజెంట్ కు మధ్య యుద్ధాన్ని చూపించబోతున్నారన్నమాట.

అన్నట్టు అఖిల్ తనకు ముందుగానే తెలుసంటున్నాడు డినో. తనకు రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అని, చరణ్ ద్వారా అఖిల్ ను గతంలోనే కలిశానని వెల్లడించాడు. 28న థియేటర్లలోకి వస్తోంది ఏజెంట్.

Tags:    
Advertisement

Similar News