Rashmika Filmfare | ఫిలింఫేర్ అవార్డులపై నిరసన

Filmfare Rashmika - ఫిలింఫేర్ అవార్డులపై సోషల్ మీడియాలో నిరసన కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రష్మికకు అవార్డ్ రాకపోవడం అన్యాయం అంటోంది ఓ బ్యాచ్.

Advertisement
Update: 2024-02-01 16:43 GMT

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి. ఇటీవల ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023 గ్రాండ్ గా జరిగింది. రణబీర్ కపూర్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకోగా, అలియా భట్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. విధు వినోద్ చోప్రా 12వ ఫెయిల్ 2023కి గానూ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్నాకుయ

ఈ అవార్డులపై, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా విమర్శలు చెలరేగాయి. ఉత్తమ నటుడి అవార్డును రణబీర్ కపూర్‌కు బదులుగా షారుక్ ఖాన్ కు ఇచ్చి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడ్డారు. యానిమల్ లో రణబీర్ అద్భుతంగా నటించాడు. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ 2023లో బాక్సాఫీస్ ను రూల్ చేసిన షారూక్ ను గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు అతడి ఫ్యాన్స్.

మరోవైపు, రాకీ ఔర్ రాణి కి కహానీకి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది అలియా భట్. ఈ సినిమాలో అలియాభట్ ఏం చేసిందనేది ప్రశ్న. అది సవాల్ తో కూడుకున్న పాత్ర కాదు. అలా అని అలియా కూడా గొప్పగా నటించలేదు. అయినా కూడా ఆమెకు ఉత్తమ నటి అవార్డ్ ఇచ్చారనేది చాలామంది వాదన. యానిమల్ లో చక్కగా నటించిన రష్మికను కనీసం నామినేట్ చేయకపోవడం బాధాకరం అంటున్నారు చాలామంది. ఇలా ఎప్పట్లానే ఫిలింఫేర్ అవార్డులపై మరోసారి విమర్శలు, వాదనలు చెలరేగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News