Love Me | ఆశిష్ రెండో సినిమా రిలీజ్ కు రెడీ

Love Me Movie - ఆశిష్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా లవ్ మీ. ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ లాక్ చేశారు.

Advertisement
Update: 2024-03-24 09:50 GMT

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావటమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచింది.

బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న సినిమా లవ్ మీ. ఓ కుర్రాడు, దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది.. ఏమవుతుంది.. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ‘లవ్ మీ’ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఇలా టాప్ టెక్నీషియన్స్ అండతో వస్తోంది లవ్ మీ సినిమా.

మొదటి సినిమా రౌడీబాయ్స్ తో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు ఆశిష్. సినిమా బ్రేక్ ఈవెన్ అయిందంటూ దిల్ రాజు ప్రకటించుకున్నప్పటికీ, ఆశిష్ కు కమర్షియల్ సక్సెస్ రాలేదు. లవ్ మీ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News