Ashish Reddy | ఓ ఇంటివాడైన ఆశిష్ రెడ్డి

Ashish Reddy - దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి ఓ ఇంటివాడయ్యాడు. రౌడీ బాయ్స్ సినిమాతో ఇతడు టాలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే.

Advertisement
Update: 2024-02-20 16:21 GMT

రౌడీ బాయ్స్ తో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆశిష్ రెడ్డి. దిల్ రాజు తమ్ముడు కొడుకు ఇతడు. ఇప్పుడీ హీరో ఓ ఇంటివాడయ్యాడు. జైపూర్ లో ఆశిష్ రెడ్డి, అద్వైత రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన తొలి ఫొటోను ఆశిష్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సంప్రదాయ దుస్తుల్లో ఆశిష్, అద్వైత కూర్చున్న స్టిల్ అది.

ఆశిష్ కు త్వరగా పెళ్లిచేయాలని దిల్ రాజు కుటుంబం నిశ్చయించింది. అనుకున్నదే తడవుగా మంచి సంబంధం వెదికింది. ఆ వెంటనే టాలీవుడ్ లో చాలామంది ప్రముఖులకు స్వయంగా దిల్ రాజు, ఆశిష్, శిరీష్ వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేశారు. వాళ్లలో చాలామంది జైపూర్ పెళ్లికి హాజరయ్యారు. చిరంజీవి మాత్రం అమెరికాలో ఉండడం వల్ల వివాహానికి వెళ్లలేకపోయారు.

రౌడీబాయ్స్ తో సక్సెస్ అందుకోలేకపోయాడు ఆశిష్. ప్రస్తుతం ఈ హీరో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు. ఇవానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మళ్లీ రీషూట్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు. ఈ గ్యాప్ లో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు ఆశిష్.

Tags:    
Advertisement

Similar News