HIT 2 Movie: హిట్-2 ట్రయిలర్ రివ్యూ

Adivi Sesh's HIT2 movie trailer: అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా HIT 2. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంఛ్ చేశారు

Advertisement
Update: 2022-11-23 11:51 GMT

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో నాని సమర్పణలో తెరకెక్కిన 'HIT2' డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. రెండున్నర నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. టీజర్ లో లాస్ట్ షాట్ కి ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చారు.


హాస్పిటల్ బయట డేడ్ బాడీ ముందు శేష్ నిలబడి చూస్తున్న విజువల్ తో స్టార్టయిన ట్రైలర్ ఎండింగ్ లో "హెడ్ మాత్రమే సంజనది.. చేతులు , కాళ్లు , మొండెం వేర్వేరు అమ్మాయిలవి" అంటూ తన టీం మెంబర్ చెప్పే డైలాగ్ తో సెకండ్ కేస్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు.


క్రిమినల్స్ అంటే కోడి బుర్ర అనుకునే కేడీ, సైకో కిల్లర్ కేసును ఎలా ఎలా ఛేదించాడనేది ఈ సినిమా స్టోరీ. ఇన్వెస్టిగేషన్ విజువల్స్ చూస్తే సినిమా గ్రిప్పింగా ఉంటూ థ్రిల్ చేయనుందని అర్థమవుతుంది.


ట్రైలర్ లో రావు రమేష్ పాత్ర అతని స్వభావాన్ని కూడా చూపించారు. అలాగే సంజన కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక కేడీపై జరిగే ఎటాక్స్ కూడా ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ లో సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. 


అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించగా, నాని సమర్పించాడు.


Full View


Tags:    
Advertisement

Similar News