అహింస మూవీ టీజర్ ఎలా ఉందంటే..!

దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమౌతున్న సినిమా అహింస. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది

Advertisement
Update: 2022-10-07 03:06 GMT

ప్రేమకథలకు పెట్టింది పేరు తేజ. ఈ దర్శకుడి నుంచి ఓ సినిమా వచ్చిందంటే, అందులో లవ్ తప్పనిసరిగా ఉంటుంది. ఈసారి మరో ప్రేమకథను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు ఈ దర్శకుడు. ఆ సినిమా పేరు అహింస.

ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, ఆది పినిశెట్టి లాంటి ఎంతోమంది ఆర్టిస్టుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ.. ఈసారి నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో రానా తమ్ముడు అభిరామ్ ను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

జీవితంలో పెద్ద కలలు లేని కుర్రాడు అభిరామ్. వ్యవసాయం చేసుకుంటూ తనకున్న దానితో సంతోషంగా ఉంటాడు. హింసకు పూర్తిగా వ్యతిరేకి. అహింసా మార్గాన్ని అనుసరించే బుద్ధుని తత్వశాస్త్రాన్ని అనుసరించమని అందరికీ చెబుతుంటాడు. అయితే కొన్ని అనుకోని సంఘటనలతో అతని జీవితం మలుపు తిరుగుతుంది. అహింసని పాటించే అభిరామ్ కి హింసాత్మక పరిస్థితులు ఎదురైతే ఏం జరిగిందనే నేపధ్యాన్ని టీజర్ లో చూపించారు.

తేజ ఒక అందమైన ప్రేమకథను అద్భుతంగా చెప్పారు. టీజర్‌ను చూస్తుంటే కథలో బలమైన సంఘర్షణ ఉందనే విషయం కనిపిస్తోంది. అభిరామ్ అమాయకమైన పాత్రకు న్యాయం చేయగా, గీతికకు బలమైన పాత్ర లభించింది. టీజర్‌లో సదాతో పాటు మరికొన్ని కీలక పాత్రలు కూడా కనిపించాయి.

ఆర్‌పి పట్నాయక్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌, సమీర్ రెడ్డి కెమెరా పనితనం టీజర్ రేంజ్ ను పెంచాయి. పూర్తిగా తేజ మార్క్ తో అహింస తెరకెక్కిందనే విషయం టీజర్ చూస్తే తెలుస్తోంది. 


Full View


Tags:    
Advertisement

Similar News