లైగర్ నుంచి మరో లిరికల్ వీడియో

లైగర్ నుంచి ముచ్చటగా మూడో సాంగ్ రిలీజైంది. ఈసారి మాంచి రొమాంటిక్ నంబర్ విడుదల చేశారు.

Advertisement
Update: 2022-08-07 02:45 GMT

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ''లైగర్''. సాలా క్రాస్‌బ్రీడ్ అనేది క్యాప్షన్. ఆగస్ట్ 25న విడుదలౌతుంది. మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలోకి ఎంటరయ్యాడు.

ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు సింగిల్స్- 'అక్డీ పక్డీ ', వాట్ లగా దేంగే సినిమాపై అంచనాలను పెంచాయి. ఇప్పుడు మూడో పాట - ఆఫత్ తాజాగా విడుదలైయింది.

అందమైన బీచ్ హౌస్‌ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన ఈ పాట హమ్ చేసుకునే లాఉంది. రమ్యకృష్ణ తన కొడుకు విజయ్ దేవరకొండకు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండమని చెప్పడం, విజయ్, అనన్య ఇంటి నుండి బయటకు వచ్చి బీచ్‌కి వెళ్ళడం లవ్లీగా ఉంది.

సాంగ్ లో విజయ్, అనన్యల కెమిస్ట్రీ బాగుంది. తెలుగు పాటని సింహా, శ్రావణ భార్గవి అలపించగా.. భాస్కరబట్ల లిరిక్స్ అందించాడు. ఈ పాటకు తనిష్క్ బాగ్చి సంగీతాన్ని అందించగా, పియూష్-షాజియా కొరియోగ్రఫీ అందించారు.

పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. 


Full View


Tags:    
Advertisement

Similar News