దక్షిణాది వారిపై కుట్ర జరుగుతోంది- ఎంపీ మాగుంట వ్యాఖ్యలు

అమిత్ అరోరా అనే వ్యక్తి నార్త్ ఇండియా వ్యాపారి అని.. అతడు తమపై చెప్పిన వివరాలు కేవలం సౌత్ ఇండియా వ్యాపారులను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే చేశారని మాగుంట చెప్పారు.

Advertisement
Update: 2022-12-01 07:21 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంతో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. 70ఏళ్లుగా తాము లిక్కర్ వ్యాపారంలో ఉన్నామని.. ఏనాడు అక్రమాలకు పాల్పడలేదన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నార్త్ ఇండియా వ్యాపారులు.. దక్షిణాదికి చెందిన వ్యాపారులపై చేస్తున్న కుట్రగా అనిపిస్తోందన్నారు.

అమిత్ అరోరా అనే వ్యక్తి నార్త్ ఇండియా వ్యాపారి అని.. అతడు తమపై చెప్పిన వివరాలు కేవలం సౌత్ ఇండియా వ్యాపారులను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే చేశారని మాగుంట చెప్పారు. లిక్కర్ స్కాంతో మాగుంట కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అమిత్ అరోరా అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు.

తాము మాగుంట సుబ్బరామిరెడ్డి 27వ వర్ధంతి కార్యక్రమంలో బిజీగా ఉన్నామని, కార్యక్రమం పూర్తవగానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన ధర్మం తనపై ఉందని.. దాన్ని పాటిస్తానన్నారు.

ఢిల్లీ ప్రభుత్వంలోని వారికి 100 కోట్ల రూపాయలు పంపిన సౌత్ గ్రూప్‌ సంస్థ శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి నియంత్రణలోనే ఉందంటూ ఈడీ ఆరోపించిన నేపథ్యంలో మాగుంట స్పందించారు.

Tags:    
Advertisement

Similar News