టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జరిమానా, జైలుశిక్ష.. ఎందుకంటే..?

జరిమానా చెల్లించకపోతే మరో వారం అదనంగా జైలు శిక్ష పొడిగించాలని ఆదేశాలిచ్చింది. ఉద్యోగుల నియామకాల విషయంలో కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని చెప్పింది.

Advertisement
Update: 2022-12-13 14:18 GMT

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు నెలరోజుల జైలుశిక్ష విధించింది. 2వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించకపోతే మరో వారం అదనంగా జైలు శిక్ష పొడిగించాలని ఆదేశాలిచ్చింది. ఉద్యోగుల నియామకాల విషయంలో కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజా తీర్పునిచ్చింది.

అసలేం జరిగింది..?

తాత్కాలిక ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ విషయంలో గతంలో ధర్మ ప్రచార పరిషత్తులో ఉన్న ముగ్గురు సిబ్బంది ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. వారి సర్వీసు క్రమబద్ధీకరించాలని చెప్పింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయడంలో టీటీడీ ఆలస్యం చేసింది. దీంతో ఉద్యోగులు మరోసారి కోర్టుని ఆశ్రయించారు. ఉద్దేశ పూర్వకంగానే కోర్టు తీర్పు అమలు చేయడంలేదని ధర్మారెడ్డిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తమ ఆదేశాలు అమలు చేయనందుకు జరిమానా, జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఈనెల 27వ తేదీలోపు అమలు చెయ్యకపోతే శిక్షా ఉత్తర్వులు అమలు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ధర్మప్రచార పరిషత్తులో వున్న ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ ను క్రమబద్దికరీంచాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది. దీనిపై రేపు టీటీడీ అప్పీలుకి వెళ్లబోతోంది.

Tags:    
Advertisement

Similar News