ట్విట్టర్ అకౌంట్ తిరిగొచ్చింది.. పరువు పోయింది..

ట్విట్టర్ అకౌంట్ తిరిగొచ్చిందన్న సంతోషంలో ఉన్న టీడీపీ నేతలకు, పదే పదే పరువు పోగొట్టుకోవడం మాత్రం ఇబ్బందిగా మారింది.

Advertisement
Update: 2022-10-02 02:35 GMT

"హైటెక్ సిటీ కట్టింది నేనే, తెలుగు రాష్ట్రాలకు ఇంటర్నెట్ తెచ్చింది నేనే, అది నేనే - ఇది నేనే.." ఇలా ఉంటాయి చంద్రబాబు ప్రసంగాలు. విన్నోళ్లకు విన్నంత, నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత. ఇంకెవరూ ఆయన్ను ఎగతాళి చేయాల్సిన పనిలేదు, తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకుంటూ, చరిత్ర చెప్పుకుంటూ జనంలో పలుచన అయిపోతుంటారు బాబు. అలాంటి ఆయనకు ఇప్పుడు మరో పెద్ద కష్టమొచ్చింది. టెక్నాలజీ పితామహుడి పార్టీ అకౌంట్ దాదాపు ఒకరోజంతా బ్లాక్ అయింది. దీంతో సోషల్ మీడియాలో టీడీపీ ఏడుపు అంతా ఇంతా కాదు.

షేమ్ ఆన్ యూ వైఎస్సార్సీపీ అంటూ ఇదంతా వైసీపీ పనేనంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అక్కడితో ఆగలేదు. టీడీపీ దెబ్బకి వైసీపీ భయపడిపోయి ఇలాంటి పన్నాగాలు పన్నుతోందని అన్నారు. అయితే ఊహించని విధంగా నెటిజన్ల నుంచి టీడీపీ నేతలకు సమాధానాలొచ్చాయి. టెక్నాలజీకి తానే ఆద్యుడిని అని చెప్పుకునే చంద్రబాబు, ఆమాత్రం ట్విట్టర్ అకౌంట్ ని కాపాడుకోలేరా అంటూ సెటైర్లు పేల్చారు నెటిజన్లు. ట్విట్టర్ అకౌంట్ ని కాపాడుకోలేని టీడీపీ 26 జిల్లాల ప్రజల్ని ఏం కాపాడుతుందంటూ ప్రశ్నించారు.

వెన్నుపోటుకే వెన్నుపోటు..

ఎన్టీఆర్ దగ్గరనుంచి చంద్రబాబు టీడీపీ ని లాగేసుకున్నారు, చంద్రబాబు దగ్గర్నుంచి టీడీపీ ట్విట్టర్ ని టైలర్ హాబ్స్ లాగేసుకున్నారు. అంటే ఇక్కడ వెన్నుపోటుకే వెన్నుపోటు దిగింది అంటూ మరో రకమైన కామెంట్లు టీడీపీని ఇబ్బంది పెట్టాయి. మొత్తమ్మీద ట్విట్టర్ అకౌంట్ తిరిగొచ్చిందన్న సంతోషంలో ఉన్న టీడీపీ నేతలకు, ఇలా పదే పదే పరువు పోగొట్టుకోవడం మాత్రం ఇబ్బందిగానే మారింది. ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి కారణం వైసీపీయేనంటూ చేసిన ఆరోపణ మరింత పరువు తక్కువగా మారింది.

Tags:    
Advertisement

Similar News