లోకేష్ వర్సెస్ తారక్.. లక్ష్మీ పార్వతి లేటెస్ట్ కామెంట్స్

ఎన్టీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు లక్ష్మీపార్వతి. టీడీపీ నాయకత్వం లోకేష్ కి అప్పగించేందుకు తారక్ సిద్ధంగా లేరని అన్నారు లక్ష్మీపార్వతి.

Advertisement
Update: 2023-01-08 07:14 GMT

ఎన్టీఆర్ మనవడిగా తెలుగుదేశం పార్టీ కోసం ఆమధ్య కాస్త హుషారుగా పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు మనసెరిగిన తర్వాత సైలెంట్ అయిపోయారు. పార్టీకోసం పనిచేసినా ప్రయోజనం లేదనుకున్నారో, అసలు తనకీ వయసులో రాజకీయాలు వద్దనుకున్నారో ఏమో కానీ.. మొత్తానికి సినిమాలకే పరిమితమై మంచి పని చేశారంటూ అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఈ దశలో పదే పదే ఎన్టీఆర్ పేరుని ఏపీ రాజకీయాల్లోకి తీసుకు రావాలని చూడటం పరిపాటిగా మారింది. అందులోనూ ఎన్టీఆర్ తో లోకేష్ కి పోలిక పెట్టి కామెంట్ చేయడం వైసీపీ నాయకులకు బాగా అలవాటు. తాజాగా లక్ష్మీపార్వతి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లోకేష్ ని బోనులో నిలబెట్టారు. జూనియర్ కి టీడీపీ పగ్గాలప్పగిస్తే ఆయన కచ్చితంగా పార్టీకోసం పనిచేస్తారని అన్నారు.

లోకేష్ కి పగ్గాలు వద్దు..

నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఏం జరుగుతుందనే విషయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. పార్టీని నడపడం లోకేష్ కి చేతకాదు అనేవారి సంఖ్యే చాలా ఎక్కువ. పార్టీ బయట ఉన్నవారు కూడా పగ్గాలు లోకేష్ కి ఇవ్వడం కంటే, ఎన్టీఆర్ కి ఇవ్వడమే మంచిదని అభిప్రాయపడుతుంటారు. ఎన్టీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు లక్ష్మీపార్వతి. టీడీపీ నాయకత్వం లోకేష్ కి అప్పగించేందుకు తారక్ సిద్ధంగా లేరని అన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్‌ కి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే మాత్రం.. ఆయన తప్పకుండా టీడీపీలోకి వస్తాడని అభిప్రాయపడ్డారు. ఇంతకుమించి తానేం మాట్లాడలేనని, టీడీపీలోకి తారక్ అడుగుపెట్టాక తాను స్పందిస్తానని ముక్తాయించారు.

జగన్ కి తిరుగులేదు.. కానీ..!

సీఎం జగన్ కి తిరుగులేదు అని చెప్పేవారు కూడా టీడీపీపై కాస్తో కూస్తో సింపతీ చూపించడం పరిపాటి. వైసీపీలో ఉన్న కొడాలి నాని.. ఏపీలో జగన్ కి తిరుగులేదంటారు, అదే సమయంలో టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కి ఇస్తే పార్టీ బాగుంటుందని చెబుతారు. ఇటు జై జగన్ అంటారు, అటు ఎన్టీఆర్ కి కూడా తమ సపోర్ట్ ఉందని ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకుంటారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. ప్రస్తుతానికి సీఎం జగన్ పాలన చాలా బాగుందని పేర్కొన్నారు. ఎంతమంది కలిసొచ్చినాసరే.. జగన్‌ని ఎదురించలేరని అన్నారు. మరి జగన్ కి తిరుగే లేనప్పుడు టీడీపీకి బాస్ లోకేష్ అయితే ఏంటి, ఎన్టీఆర్ అయితే ఏంటి..?

Tags:    
Advertisement

Similar News