రామోజీ, శైలజల క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకున్న సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సీఐడీ.. రామోజీరావును ఏ–1గా, శైలజా కిరణ్‌ను ఏ–2గా చేర్చింది.

Advertisement
Update: 2023-10-17 09:16 GMT

మార్గదర్శిలో తన షేర్లను బెదిరించి లాక్కున్నారంటూ మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి కుమారుడు యూరిరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆఘమేఘాలపై రామోజీరావు, శైలజా కిరణ్‌ల తరఫున వారి న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మార్గదర్శిలోని తన షేర్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో శైలజ పేరు మీదకు మార్చారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తుపాకీతో బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని వివరించారు. యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకున్న సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సీఐడీ.. రామోజీరావును ఏ–1గా, శైలజా కిరణ్‌ను ఏ–2గా చేర్చింది.

బాబు లాయరే రామోజీకీ..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు తరఫున కేసు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రానే రామోజీ తరఫున కూడా వాదిస్తుండటం గమనార్హం. మంగళవారం జరిగిన విచారణకు ఆయన న్యాయస్థానంలో రామోజీ తరఫున వాదనలు వినిపించేందుకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో రామోజీరావు, శైలజలపై బుధవారం వరకు తీవ్ర చర్యలు తీసుకోబోమని సీఐడీ న్యాయవాది కోర్టులో చెప్పడంతో న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News