మేకపాటి డిమాండ్‌ను గౌరవించిన జగన్

ఎమ్మెల్యే డిమాండ్‌ను గౌరవించింది. కొడవలూరి ధనుంజయరెడ్డిని తొలగించి ఆ స్థానంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డిని ఉదయగిరి పరిశీలకుడిగా నియమించారు.

Advertisement
Update: 2023-02-08 01:53 GMT

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు మారారు. ఉదయగిరి పరిశీలకుడిగా ఉన్న కొడవలూరి ధనుంజయరెడ్డికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య సఖ్యత లేదు. ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ధనుంజయ రెడ్డి పెత్తనం చేస్తున్నారంటూ ఇటీవల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. తక్షణం ధనుంజయ రెడ్డిని తొలగించాలని లేని పక్షంలో తాను ఎంతవరకైనా వెళ్తానని హెచ్చరించారు. నియోజకవర్గంలో ధనుంజయ రెడ్డి గ్రూపులను రెచ్చగొడుతున్నారని.. టీడీపీ వారికి మద్దతుగా ఉంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

ఇప్పటికే నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీకి ఎదురుతిరిగారు. ఎంత దూరమైన వెళ్తానని మేకపాటి హెచ్చరించడంతో ధనుంజయ రెడ్డిని మారుస్తారా? లేదా అన్న దానిపై చర్చ జరిగింది. ఇక్కడ మాత్రం వైసీపీ నాయకత్వం పట్టువిడుపు ధోరణిని ప్రదర్శించింది. ఎమ్మెల్యే డిమాండ్‌ను గౌరవించింది. కొడవలూరి ధనుంజయరెడ్డిని తొలగించి ఆ స్థానంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డిని ఉదయగిరి పరిశీలకుడిగా నియమించారు.

మెట్టుకూరు ధనుంజయ రెడ్డిది ఆత్మకూరు నియోజకవర్గం. మేకపాటి డిమాండ్ చేసిన వారంలోనే పరిశీలకుడిని మార్చడం ద్వారా నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే ఎదురుతిరిగే పరిస్థితి లేకుండా నివారించినట్టు అయింది.

Tags:    
Advertisement

Similar News