చింతకాయల విజయ్‌పై సీఐడీ గురి

ప్రస్తుతం సీఐడీ పోలీసులు రావడానికి కారణం రెండు రోజుల క్రితం జగన్‌ ప్రసంగాన్నికించపరిచేలా, మార్పింగ్‌ చేస్తూ ఒక వీడియోను టీడీపీ షేర్ చేసింది.

Advertisement
Update: 2022-10-01 10:07 GMT

టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో విజయ్‌ ఇంట్లో లేరు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న ఆయన ముందే బయటకు వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. దాంతో ఇంట్లో ఉన్న సర్వెంట్‌కు నోటీసులు అందజేశారు.

విజయ్ ఐటీడీపీ కో-కన్వీనర్‌గా ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఈయనపై ఇప్పటికే గోరంట్ల మాధవ్‌ కూడా తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సీఐడీ పోలీసులు రావడానికి కారణం రెండు రోజుల క్రితం జగన్‌ ప్రసంగాన్నికించపరిచేలా, మార్పింగ్‌ చేస్తూ ఒక వీడియోను టీడీపీ షేర్ చేసింది.

ఆ విషయంలోనే ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఈనెల 6న గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్ద హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో సీఐడీ ఆదేశించింది.

కోర్టు ఎన్నిసార్లు చెప్పినా జగన్‌కు బుద్ధి రాలేదని.. అయ్యన్నపాత్రుడి కుటుంబాన్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని, విజయ్‌ను అరెస్ట్ చేసేందుకు కూడా సీఐడీ ప్రయత్నించిందని నారా లోకేష్ ఆరోపించారు. చింతకాయల విజయ్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ట్రెండ్ సెట్‌లో నివాసం ఉంటున్నారు.

Tags:    
Advertisement

Similar News