జాతీయ స్థాయిలో డ్యామేజీ అయిన ఇమేజీ

ఎప్పుడైతే గుంటూరు బహిరంగ సభలో కూడా తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారో.. వెంటనే రెండు ఘటనలను కలిపి కథనాలు అందించాయి. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ లాంటి ఛానళ్ళు రెండు ఘటనలను కలిపి ప్రముఖంగా ప్రసారం చేశాయి.

Advertisement
Update: 2023-01-03 05:51 GMT

చంద్రబాబునాయుడు ఇమేజీ జాతీయస్ధాయిలో డ్యామేజీ అయిపోయింది. గుంటూరు బహిరంగ సభలో తొక్కిసలాట జరగటం, ముగ్గురు మహిళలు చనిపోవటాన్ని జాతీయ ఛానళ్ళు ప్రముఖంగా ప్రసారం చేశాయి. తొక్కిసలాట దృశ్యాలను కూడా చూపించాయి. గుంటూరు తొక్కిసలాట ఘటనతో పాటు అంతకుముందు నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కిసలాటలో 8 మంది చనిపోయిన ఘటనను కూడా బాగా హైలైట్ చేశాయి. మొదట్లో కందుకూరులో జరిగిన తొక్కిసలాటను ఒక ఇన్సిడెంటుగా మాత్రమే అప్పట్లో చూపించాయి.

ఎప్పుడైతే గుంటూరు బహిరంగ సభలో కూడా తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారో.. వెంటనే రెండు ఘటనలను కలిపి కథనాలు అందించాయి. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ లాంటి ఛానళ్ళు రెండు ఘటనలను కలిపి ప్రముఖంగా ప్రసారం చేశాయి. చంద్రబాబు కార్యక్రమాల్లోనే నాలుగు రోజుల వ్యవధిలో 11 మంది చనిపోయినట్లు కథనాల్లో చెప్పుకొచ్చాయి. దాంతో చంద్రబాబు ఇమేజీ జాతీయస్ధాయిలో బాగా డ్యామేజీ అయిపోయింది. వార్తలు బయటకు రాకుండా టీడీపీ చాలా ప్రయత్నాలే చేసింది.

రాష్ట్రంలోని మెజారిటీ మీడియాలో తాను అనుకున్నట్లే కథనాలు, వార్తలను ప్రసారం చేయించుకోగలిగింది టీడీపీ. చంద్రబాబు ఇమేజీకి భంగం జరగకుండా జాగ్రత్తలు పడింది. కందుకూరు తొక్కిసలాటలో చంద్రబాబు పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. తొక్కిసలాటకు పోలీసులే కారణమన్నట్లుగా ఎదురుదాడి చేసింది. గుంటూరు తొక్కిసలాట అయితే అసలు టీడీపీకి సంబంధమే లేదని ఎల్లోమీడియా తేల్చేసింది. ఇదంతా ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం అన్నట్లుగా కలరింగ్ ఇచ్చింది.

అయితే జాతీయ మీడియా మాత్రం చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాల్లో తొక్కిసలాటలో మరణాలంటూ ప్రముఖంగా చెప్పింది. రెండు ఘటనల్లోను టీడీపీదే ఫెయిల్యూర్ అన్నట్లుగా జాతీయ మీడియా తేల్చేసింది. తొక్కిసలాట ఘటనలను, మరణాలను జాతీయ మీడియా ఇంతగా హైలైట్ చేస్తుందని బహుశా చంద్రబాబు, తమ్ముళ్ళు ఊహించుండరు. దీంతో డ్యామేజీ అయిన ఇమేజీని కాపాడుకునేందుకు చంద్రబాబు ఇప్పుడు నానా అవస్థ‌లు పడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు. కానీ ఇంకొక్కటి జరిగిందంటే మాత్రం చంద్రబాబు పని దాదాపు అయిపోయినట్లే.

Tags:    
Advertisement

Similar News