బాబు తీరు న‌చ్చ‌క‌.. రాజకీయాలకు అశోక్‌ గజపతి రాజు గుడ్‌బై..?

అశోక్‌ గజపతి రాజు దూరమైతే విజయనగరం జిల్లాలో వైసీపీని ఎదుర్కోవడం టీడీపీకి కష్టమే అవుతుంది. మంత్రి బొత్స సత్యనారాయణకు అక్కడ మంచి పట్టు ఉంది.

Advertisement
Update: 2024-02-15 11:50 GMT

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యవహారం నచ్చక టీడీపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. గజపతిరాజు రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తన డిమాండ్‌ను చంద్రబాబు అంగీకరించకపోవడంతో ఆయన కినుక వహించినట్లు సమాచారం. విజయనగరం లోక్‌సభ సీటుతో పాటు శాసనసభా స్థానాన్ని కూడా అశోక్‌ గజపతి రాజు ఆశిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తన కూతురు అదితి గజపతి రాజుకు శాసనసభ స్థానం కోరుతున్నారని అంటున్నారు. అయితే అందుకు చంద్రబాబు ససేమిరా అన్నట్లు చెప్పుతున్నారు.

విజయనగరం శాసనసభా స్థానాన్ని బీసీ నేతకు ఇవ్వాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు, దాంతో తీవ్రమైన అసంతృప్తికి గురైన అశోక్‌ గజపతిరాజు పూర్తిగానే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

అశోక్‌ గజపతి రాజు దూరమైతే విజయనగరం జిల్లాలో వైసీపీని ఎదుర్కోవడం టీడీపీకి కష్టమే అవుతుంది. మంత్రి బొత్స సత్యనారాయణకు అక్కడ మంచి పట్టు ఉంది. అశోక్‌ గజపతి రాజు రాజకీయాల నుంచి తప్పుకుంటే బొత్స సత్యనారాయణను ఎదుర్కోవడం టీడీపీకి ఏ మాత్రం సులభం కాదు.

Tags:    
Advertisement

Similar News