దోచుకోవడంలో బాబు ‘స్కిల్’ వేరే లెవల్.. అసెంబ్లీలో జగన్ సెటైర్

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్‌ ఇదని అన్నారు.

Advertisement
Update: 2023-03-20 15:55 GMT

ఏపీ అసెంబ్లీలో ఫైటింగ్ సీన్ తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై రోజంతా చర్చ జరిగింది. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ప్రజా ధనం దోచుకున్నారని, 371 రూపాయలు స్కామ్ చేశారని అన్నారు సీఎం జగన్. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో యువతకు ఉపాధి శిక్షణ కల్పిస్తామంటూ బూటకపు ప్రచారం చేశారని, షెల్ కంపెనీలతో ప్రజల సొమ్ము దోచుకున్నారని అన్నారు.


ఆయన ‘స్కిల్’ వేరు..

రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌ ఇదని అన్నారు సీఎం జగన్. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్‌ ఇదని అన్నారు. రూ..371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారన్నారు. ఆ డబ్బులను షెల్‌ కంపెనీ ద్వారా విదేశాలకు మళ్లించి, వాటిని మళ్లీ చంద్రబాబు కంపెనీలలోకి తరలించారని, పక్కా స్కిల్డ్‌ క్రిమినల్‌ చేసిన స్కామ్‌ ఇదని ఎద్దేవా చేశారు. ఈ స్కామ్ ఏపీలో మొదలై విదేశాలకు పాకిందని చెప్పారు జగన్.

అధికార దుర్వినియోగం..

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం జగన్. కేబినెట్‌ లో ఒకటి చెప్పి వాస్తవంగా మరొకటి చేశారన్నారు. అర్హులైన వారికి నేరుగా నగదు జమ చేసే డీబీటీని ఈ ప్రభుత్వం చేస్తుంటే.. గత ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో... అనే డీపీటీ కార్యక్రమం చేసిందన్నారు. దోపిడీచేసిన వారు చట్టం నుంచి, ప్రజలనుంచి తప్పించుకోలేరన్నారు జగన్.

Tags:    
Advertisement

Similar News