వైసీపీ మరో ప్రయోగం..175 మంది పరిశీలకులు

వైసీపీ ఏర్పడిన తరువాత రాజకీయ పార్టీల మూసకి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.

Advertisement
Update: 2022-09-12 12:25 GMT

వైసీపీ ఏర్పడిన తరువాత రాజకీయ పార్టీల మూసకి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. పార్టీ జిల్లా కమిటీలను పార్లమెంటు నియోజకవర్గం కమిటీలుగా మార్చేశారు. అధికారంలోకి వచ్చాక పార్టీలో మరిన్ని ప్రయోగాలకి తెరతీశారు.

ఇటీవల నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తని నియమించారు. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి ఓ పరిశీలకుడిని నియమించేందుకు కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ కు అదనంగా అబ్జర్వర్ ని నియమించనున్నారు. ఈ పరిశీలకులు నియోజకవర్గ నేతలకు, పార్టీకి అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, గ్రూపుతగాదాలు, పరిష్కరించాల్సిన సమస్యలు హైకమాండ్ కు నివేదించనున్నారు. 175 నియోజకవర్గాలకి ప్రతిపాదిత అబ్జర్వర్ల జాబితా సిద్ధం చేసే బాధ్యతను జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకి అప్పగించారు. జాబితాకి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ వారంలోనే పరిశీలకుల నియామకం పూర్తి కానుంది.

Tags:    
Advertisement

Similar News