హీరో చియాన్ విక్రమ్ కు అస్వస్థత‌

హీరో చియాన్ విక్రమ్ గుండెపోటుకు గురయ్యారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆయనను ఈ రోజు చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించడంతో ఆయనకు గుండె పోటు వచ్చిందని వార్తలు వెలువడ్డాయి. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే విక్రమ్ కు గుండె పోటు వచ్చిందన్న వార్తలను ఆయన మేనేజర్ ఖండించారు. విక్రమ్ కు ఈ మధ్యాహ్నం ఛాతీలో స్వల్పంగా అసౌకర్యంగా అనిపించడంతో ఆసుపత్రిలో చేరారని మేనేజర్ సూర్యనారాయణన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న […]

Advertisement
Update: 2022-07-08 04:42 GMT

హీరో చియాన్ విక్రమ్ గుండెపోటుకు గురయ్యారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆయనను ఈ రోజు చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించడంతో ఆయనకు గుండె పోటు వచ్చిందని వార్తలు వెలువడ్డాయి. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది.

అయితే విక్రమ్ కు గుండె పోటు వచ్చిందన్న వార్తలను ఆయన మేనేజర్ ఖండించారు. విక్రమ్ కు ఈ మధ్యాహ్నం ఛాతీలో స్వల్పంగా అసౌకర్యంగా అనిపించడంతో ఆసుపత్రిలో చేరారని మేనేజర్ సూర్యనారాయణన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు నిజం కాదని సూర్యనారాయణన్ స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు వ్యాపింపచేయవద్దని ఆయన కోరారు. దీని వల్ల ఆయన కుటుంబం మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని ఆయన అన్నారు.

విక్రమ్ రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికైనా విక్రమ్ ఆరోగ్య విషయంలో అందరికీ స్పష్టత వస్తుందని భావిస్తున్నామని చెప్పిన మేనేజర్ ఊహాగానాలకు అడ్డుకట్ట పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూర్యనారాయణన్ తెలియజేశారు

Tags:    
Advertisement

Similar News