కలర్ ఫొటోకు ఈ గుర్తింపు ఊహించలేదు

తను తీసిన కలర్ ఫొటో సినిమాకు జాతీయ అవార్డ్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు దర్శకుడు సందీప్ రాజ్..

Advertisement
Update: 2022-07-24 06:31 GMT

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా కలర్ ఫోటో సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైంది. కలర్ ఫోటో సినిమా ఆహా యాప్ లో నేరుగా స్ట్రీమింగ్ అయిందన్న సంగతి తెలిసిందే. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవ్వడంతో ఆహా టీం, కలర్ ఫోటో యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. కలర్ ఫొటో సినిమాకు జాతీయ అవార్డ్ రావడంతో ఆ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

"లాక్డౌన్ తరువాత ఆహాలో ఈ చిత్రం విడుదలైంది. రెండేళ్లు అవుతోందని అనుకున్నాం. ఎక్కడికీ వెళ్లినా ఆ సినిమాతో మమ్మల్ని గుర్తిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు రావడంతో ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. థియేటర్‌లో వచ్చే కలెక్షన్లతో ఓ వ్యాల్యూ వస్తుంది.. కానీ మాది ఓటీటీలో వచ్చింది. నిజంగానే మాకు అంత రీచ్ వచ్చిందా? అనే అనుమానం ఉంది. కానీ నిజంగానే మంచి సినిమా తీశామని మాకు ఇప్పుడు అర్థమైంది. నిజాయితీతో సినిమా తీస్తే అందరూ సినిమాను ప్రేమిస్తారని అర్థమైంది. ఆటోవాలా నుంచి ఢిల్లీలో కూర్చున్న జ్యూరీ వాళ్లకు కూడా నచ్చుతుందని అర్థమైంది. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ అవార్డు రావడంతో మా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తాను"

ఈ కార్యక్రమానికి వంశీ పైడిపల్లి ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఆహాలో ఈమధ్య ఎక్కువగా క్రియేటివ్ పార్ట్ తీసుకుంటున్న ఈ దర్శకుడు.. కలర్ ఫొటో యూనిట్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. సుహాస్, సందీప్, సాయిరాజేష్ చిన్నచిన్న స్కిట్లు చేసుకుంటూ, జాతీయ అవార్డ్ అందుకునే స్థాయికి రావడం గర్వించదగ్గ విషయం అన్నాడు.

Tags:    
Advertisement

Similar News