జర్నలిస్టు జుబేర్‌పై ఫిర్యాదు చేసిన ‘హనుమాన్ భక్త్’ పత్తాలేడు.. పోలీసుల గాలింపు

ఫ్యాక్ట్ చెక్ వైబ్ సైట్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్‌ను ఒక వివాదాస్పద ట్వీట్ విషయంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని ఒక ట్విట్టర్ అకౌంట్ యూజర్ నుంచి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, సదరు కంప్లైట్ ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. @balajikijaiin అనే యూజర్ ఐడీ, ‘హనుమాన్ భక్త్‘ అనే ప్రొఫైల్ నేమ్ పెట్టుకున్న […]

Advertisement
Update: 2022-06-30 01:56 GMT

ఫ్యాక్ట్ చెక్ వైబ్ సైట్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్‌ను ఒక వివాదాస్పద ట్వీట్ విషయంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని ఒక ట్విట్టర్ అకౌంట్ యూజర్ నుంచి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కాగా, సదరు కంప్లైట్ ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. @balajikijaiin అనే యూజర్ ఐడీ, ‘హనుమాన్ భక్త్‘ అనే ప్రొఫైల్ నేమ్ పెట్టుకున్న ఆ అకౌంట్ ప్రస్తుతం డిలీట్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అతని కోసం ఇప్పుడు పోలీసులు తీవ్రంగా అన్వేషిస్తున్నారు.

జుబేర్‌పై జూన్ 19న కంప్లైంట్ ఇచ్చిన సదరు అకౌంట్ డిలీట్ అయినా.. తమ దర్యాప్తు ఆగదని, అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. కాగా, సదరు హనుమాన్ భక్త్ అకౌంట్‌లో కంప్లైంట్ ఇచ్చిన సమయంలో ఒకే ఒక ఫాలోవర్ ఉన్నాడని.

కేవలం ఒకటే ట్వీట్ ఉన్నదని పోలీసులు అంటున్నారు. కానీ, జుబేర్ అరెస్టు తర్వాతే అతడికి 1200 మంది ఫాలోవర్లు వచ్చారు. కానీ, బుధవారం అతడు తన అకౌంట్‌ను డిలీట్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. అతడిని ఐపీ అడ్రస్ ద్వారా పట్టుకోవడానికి బెంగళూరు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగుల సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

కంప్లైంట్ ఇచ్చిన సదరు ట్విట్టర్ అకౌంట్ యూజర్ భయపడి డిలీట్ చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, హనీమూన్ హోటల్ పేరును హనుమాన్ హోటల్‌గా మార్చినట్లు ఉన్న ఫొటోను పోస్టు చేసినందుకు జుబేర్‌ను అరెస్టు చేశారు. కాగా, అది 1983లో విడుదలైన ఒక సినిమాలోని సీన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌గా పోలీసులు గుర్తించారు.

Tags:    
Advertisement

Similar News