మంత్రి డెవలపర్స్‌ సీఎండీ అరెస్ట్..

బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్‌ కంపెనీ మంత్రి డెవలపర్స్ సీఎండీ సుశీల్‌ మంత్రిని శనివారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ కేసులో శుక్రవారం సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శనివారం ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. అనంతరం కోర్టు ఆయన్ను పది రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఫ్లాట్ల నిర్మాణం పేరుతో వేలాది మంది నుంచి వెయ్యి కోట్లకుపైగా సుశీల్‌ మంత్రి వసూలు చేశారు. కానీ పదేళ్లు గడిచినా వారికి ఫ్లాట్లు అప్పగించలేదు. అసలు నిర్మాణాలే […]

Advertisement
Update: 2022-06-25 21:48 GMT

బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్‌ కంపెనీ మంత్రి డెవలపర్స్ సీఎండీ సుశీల్‌ మంత్రిని శనివారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ కేసులో శుక్రవారం సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శనివారం ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. అనంతరం కోర్టు ఆయన్ను పది రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.

ఫ్లాట్ల నిర్మాణం పేరుతో వేలాది మంది నుంచి వెయ్యి కోట్లకుపైగా సుశీల్‌ మంత్రి వసూలు చేశారు. కానీ పదేళ్లు గడిచినా వారికి ఫ్లాట్లు అప్పగించలేదు. అసలు నిర్మాణాలే మొదలుపెట్టలేదు. దాంతో చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. స్థానిక సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్‌లో సుశీల్‌పై కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. వెయ్యి కోట్ల రూపాయలకుపైగా మొత్తాన్ని వేలాది మంది నుంచి ఫ్లాట్ల నిర్మాణం పేరుతో అడ్వాన్స్ రూపంలో వసూలు చేసినట్టు గుర్తించింది. సుశీల్‌ మంత్రి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చింది.

తప్పుడు హామీలతో ప్రజల నుంచి వెయ్యి కోట్లు వసూలుచేశారని దర్యాప్తులో తేలింది. మంత్రి డెవలపర్స్ గ్రూప్‌ వివిధ ఆర్థిక సంస్థల నుంచి 5వేల కోట్ల రూపాయలు అప్పులు కూడా తెచ్చింది. తిరిగి చెల్లించడం లేదు. ఒకే ఆస్తులను పలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మోసపూరితంగా భారీగా అప్పులు కూడా తెచ్చినట్టు ఈడీ గుర్తించింది.

Tags:    
Advertisement

Similar News