కొండా మూవీ రివ్యూ

నటీనటులు – త్రిగుణ్, ఇర్రా మోర్, పృథ్వీ, పార్వతి అరుణ్, ప్రశాంత్, ఎల్బీ శ్రీరామ్, తులసి, ‘జబర్దస్త్’ రామ్ ప్రసాద్ తదితరులు.., ఆర్ట్ – అంజి, ఆటో జానీ ఎడిటింగ్ – మనీష్ ఠాకూర్ మాటలు – భరత్ సినిమాటోగ్రఫీ – మల్హర్ భట్ జోషి నిర్మాణం – ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ నిర్మాత – సుష్మితా పటేల్ కథ – కథనం – దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ రేటింగ్ – 1.5/5 రామ్ […]

Advertisement
Update: 2022-06-23 06:22 GMT

నటీనటులు – త్రిగుణ్, ఇర్రా మోర్, పృథ్వీ, పార్వతి అరుణ్, ప్రశాంత్, ఎల్బీ శ్రీరామ్, తులసి, ‘జబర్దస్త్’ రామ్ ప్రసాద్ తదితరులు..,
ఆర్ట్ – అంజి, ఆటో జానీ
ఎడిటింగ్ – మనీష్ ఠాకూర్
మాటలు – భరత్
సినిమాటోగ్రఫీ – మల్హర్ భట్ జోషి
నిర్మాణం – ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్
నిర్మాత – సుష్మితా పటేల్
కథ – కథనం – దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
రేటింగ్ – 1.5/5

రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఒకప్పుడు సెలబ్రేషన్. ఇప్పుడు నరకం. అతడి నుంచి ఓ సినిమా వస్తుందంటే జనాలు పారిపోయే పరిస్థితి వచ్చింది. తన సినిమాల ప్రచారంపై పెడుతున్న శ్రద్ధలో కనీసం సగమైనా, అతడు తన సినిమా కథపై పెట్టి ఉంటే ఎఁతో బాగుండేది. ఆర్జీవీ సినిమాలకు సంబంధించి ప్రతిసారి సమీక్షలో ఇది చెప్పుకోవడం కామన్ అయిపోయింది. ఈసారి కూడా అదే రిపీటైంది.

ఈరోజు కొండా సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఎప్పట్లానే తనదైన కెమెరా యాంగిల్స్ చూపించాడు తప్ప, కథపై ఎలాంటి కసరత్తు చేయలేదు. కొండా మురళి బయోపిక్ గా దీనికి ప్రచారం కల్పించిన వర్మ, సినిమాలో మాత్రం కొండా సురేఖను హైలెట్ చేయడం విశేషం. సినిమా చూస్తున్నంతసేపు, ఇది కొండా మురళికి సంబంధించిన సినిమానా లేక సురేఖ కథ చెబుతున్నాడా అనే అనుమానం ప్రేక్షకుడికి కలుగుతుంది. నిజానికి ఆ అనుమానంలో చాలా నిజం ఉంది.

కథను చుట్టేసే క్రమంలో తనకు తోచినట్టు రాసుకున్నాడు వర్మ. 3 బ్లాక్స్ మాత్రమే గట్టిగా అనుకొని, మిగతా కథ మొత్తాన్ని అసిస్టెంట్లకు అప్పగించినట్టు అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వడం డీసెంట్ గానే మొదలవుతుంది. కొండా (త్రిగుణ్ అలియాస్ అదిత్ అరుణ్) అనే యువకుడ్ని, అతడి విప్లవ సిద్దాంతాల్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు వర్మ. అతడి సిద్ధాంతాలు నచ్చిన ఆర్కే (ప్రశాంత్ కార్తి), కొండాను ఎంకరేజ్ చేస్తాడు. ఉద్యమంలోకి రమ్మంటాడు. అలా నక్సలైట్ గా మారతాడు కొండా. అదే టైమ్ లో కొండా పవర్ చూస్తాడు నల్ల సుధాకర్ (పృధ్వి). కొండాను తన పార్టీలోకి ఆహ్వానిస్తాడు. అప్పటికే సైద్ధాంతిక విభేధాలతో ఉన్న కొండా, నల్ల సుధాకర్ వైపు వస్తాడు. అయితే సుధాకర్ తనను పావుగా వాడుకుంటున్నాడని కొండా గ్రహించలేడు. ఓ దశలో మాత్రం తెలుసుకుంటాడు. అప్పటికే కొండాను లేపేయడానికి నల్ల సుధాకర్ ప్లాన్ చేస్తాడు. ఆ ఉచ్చు నుంచి కొండా ఎలా తప్పించుకున్నాడు, అసలు కొండా అసలు ఉద్దేశం ఏంటి, తన రాజకీయ జీవితంలో ఏం చేసాడు అనేది స్టోరీ.

కథగా చెప్పుకుంటే సినిమా మొత్తం కొండా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ సినిమాలో కొంత దూరం వెళ్లిన తర్వాత కథ మొత్తం కొండా సురేఖ వైపు టర్న్ అయిపోతుంది. ఆ పాత్ర పోషించిన ఇర్రా మోర్ అంటే వర్మకు ఎంతిష్టమో అనిపిస్తుంది. ఒక దశలో ఈ సినిమా సురేఖ బయోపిక్ అనిపిస్తుంది. అందుకేనేమో టైటిల్ లో కొండా అని పెట్టారు. మురళిదా, సురేఖదా అని చెప్పలేదు. ఈ విషయంలో వర్మ క్లారిటీగానే ఉన్నాడు. గమనించకపోవడం మన తప్పే.

ఇక కథలోకి వస్తే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు 2-3 బ్లాకులతోనే సినిమాను ముగించాడు వర్మ. ఈ బ్లాకులు తప్ప సినిమాలో ఇంకేం లేదు. దానికితోడు తెలియని మొహాలు ఎక్కువ. మంచి పాత్రలకు కూడా ముక్కుమొహం లేని ఆర్టిస్టుల్ని పెట్టారు. సపోర్టింగ్ కాస్ట్ దారుణంగా ఉంది. ఇక పోలీసులు, నక్సలైట్ రోల్స్ పోషించిన జూనియర్ ఆర్టిస్టుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. వాళ్లంతా సినిమాలో నవ్వు తెప్పిస్తారు. నవ్వకుండానే మంచి కామెడీ పండిస్తారు.

ఓ యువకుడు వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్లడం, అతడికి లవ్ లైఫ్ ఉండడం, రాజకీయ నాయకుల మద్దతు, చివర్లో అతడు ఎంత శక్తిమంతంగా ఎదిగాడు.. ఈ టైపు స్టోరీలైన్స్ తో దశాబ్దాల కిందటే వర్మ సినిమాలు చేశాడు. ఈ కొండా సినిమాలో కూడా అదే ఉంది. ఇందులో వర్మ కొత్తగా ఏం చూపించాడనేది బూతద్ధం పెట్టి వెదికినా కనిపించదు.

కొండా పాత్ర చేసిన త్రిగుణ్, ఫస్టాఫ్ లో బాగానే కనిపించాడు. క్యారెక్టర్ కు కూడా అతికినట్టు సరిపోయాడు. సెకండాఫ్ కు వచ్చేసరికి వర్మ, సురేఖ టర్న్ తీసుకుంటాడు. దీంతో త్రిగుణ్ సైడ్ అయిపోతాడు. ఒక దశలో త్రిగుణ్ కు ఈ కథతో అస్సలు సంబంధం ఏంటి అనిపిస్తుంది. అదే ఆర్జీవీ మేజిక్కు. ఒకప్పుడు ఆర్జీవీ సినిమాల్లో డ్రామా, ఎమోషన్ పీక్స్ లో ఉండేవి. ఇప్పుడు రాజమౌళి సినిమాల్లో మనం చెప్పుకుంటున్న ఎమోషన్ ను ఎప్పుడో పండించి చూపించాడు వర్మ. అయితే ఈమధ్య కాలంలో అతడి సినిమాల్లో అలాంటి డ్రామా, ఎమోషన్ పూర్తిగా మిస్సయ్యాయి. కొండా సినిమాలో కూడా అవి కనిపించవు. రోత పుట్టించే సంగీతం, అరుపులు, హడావుడిగా ఉండే కెమెరా యాంగిల్స్ తప్ప ఎమోషన్ మచ్చుకు కూడా కనిపించదు. ఇర్రా మోర్ మాత్రం తన పాత్రకు న్యాయం చేసింది. పృధ్వి కూడా బాగా నటించాడు. మిగతా వాళ్ల గురించి చెప్పుకోడానికేం లేదు.

టెక్నికల్ గా సినిమాలో ఏం లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంతమాత్రం. సినిమాటోగ్రఫీ బాగుందని చెప్పలేం, బాగాలేదని చెప్పలేం. విప్లవ గీతాల కోసం రాసిన సాహిత్యం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చీప్ గా ఉన్నాయి. ఎడిటింగ్ బాగాలేదు. ఇక ఆర్జీవీ విషయానికొస్తే.. ఎప్పట్లానే కథను గాలికొదిలేసి సినిమా తీశాడు ఈ దర్శకుడు. అతడు కథలపై ఫోకస్ పూర్తిగా తగ్గించాడని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది కొండా మూవీ.

ఓవరాల్ గా కొండా సినిమా ఎలాంటి మెరుపుల్లేకుండా, వర్మ నుంచి ఎలాంటి సినిమా వస్తుందని జనాలు ఆశించారో అలానే ఉంది. పూర్ నెరేషన్, వీక్ స్టార్ కాస్ట్ ఈ సినిమాకు పెద్ద దెబ్బ. వర్మ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది.

Tags:    
Advertisement

Similar News