పోలీసు స్టేషన్ పై ఆదివాసుల దాడి -పోలీసులు పరార్

అమాయకంగా ఉండే ఆదివాసులు ఆగ్రహం వస్తే ఎంతకైనా తెగిస్తారు. అలాంటి సంఘటనే ఒడిశాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…ఒడిశా మల్కన్ గిరి జిల్లా చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిథిలో పోలీసులు తరుచూ తమ‌ గ్రామాలపై దాడులు చేస్తూ వేధిస్తున్నారని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. గంజాయి పేరుతో తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తూ వందలాది మంది సాంప్రదాయక ఆయుధాలతో చిత్రకొండ పోలీసు స్టేషన్ పై దాడికి దిగారు. అనేక గ్రామాల నుండి ఆయుధాలతో వచ్చిన వందలాదిమంది ఆదివాసీలను చూసి స్టేషన్ లోని […]

Advertisement
Update: 2022-06-20 21:03 GMT

అమాయకంగా ఉండే ఆదివాసులు ఆగ్రహం వస్తే ఎంతకైనా తెగిస్తారు. అలాంటి సంఘటనే ఒడిశాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…ఒడిశా మల్కన్ గిరి జిల్లా చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిథిలో పోలీసులు తరుచూ తమ‌ గ్రామాలపై దాడులు చేస్తూ వేధిస్తున్నారని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. గంజాయి పేరుతో తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తూ వందలాది మంది సాంప్రదాయక ఆయుధాలతో చిత్రకొండ పోలీసు స్టేషన్ పై దాడికి దిగారు.

అనేక గ్రామాల నుండి ఆయుధాలతో వచ్చిన వందలాదిమంది ఆదివాసీలను చూసి స్టేషన్ లోని
పోలీసులు పరారయ్యారు. ఆదివాసులు పోలీసు స్టేషన్ లో ఫర్నీచర్ ను , అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు.

Tags:    
Advertisement

Similar News