తెలుగుతెరపైకి డిఫరెంట్ కాంబినేషన్

సరైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా చేయబోతున్నాడు. అర్జున్ ఈ సినిమాను డైరక్ట్ చేయడమే కాదు, ఈ కథ కూడా అర్జున్ దే. అంతేకాదు, నిర్మాత కూడా అతడే. టాలీవుడ్ లో ఇదో డిఫరెంట్ అండ్ రేర్ కాంబినేషన్. మల్టీ టాలెంటెడ్ స్టార్లయిన విశ్వక్ సేన్, అర్జున్‌లది చాలా ఆసక్తికరమై […]

Advertisement
Update: 2022-06-20 08:04 GMT

సరైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా చేయబోతున్నాడు. అర్జున్ ఈ సినిమాను డైరక్ట్ చేయడమే కాదు, ఈ కథ కూడా అర్జున్ దే. అంతేకాదు, నిర్మాత కూడా అతడే. టాలీవుడ్ లో ఇదో డిఫరెంట్ అండ్ రేర్ కాంబినేషన్.

మల్టీ టాలెంటెడ్ స్టార్లయిన విశ్వక్ సేన్, అర్జున్‌లది చాలా ఆసక్తికరమై కాంబినేషన్. ఫలక్‌నుమా దాస్ లాంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్, ప్రస్తుతం తన దర్శకత్వంలో తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’తో బిజీగా ఉండగా, అర్జున్ తన సుదీర్ఘ కెరీర్‌లో అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడీ ఇద్దరూ కలిశారు.

అర్జున్ హోం బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో, విశ్వక్ సరసన అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించనుంది. ఈమెకిది టాలీవుడ్ డెబ్యూ. ఇప్పటికే కన్నడలో తన ప్రతిభ చాటుకున్న ఐశ్వర్య అర్జున్‌ ఈ ప్రాజెక్ట్ తో తెలుగులోకి రావడం పర్ఫెక్ట్ ఎంట్రీ కానుంది. సీనియర్ నటుడు జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇది రోడ్ ట్రిప్ మూవీ. విశ్వక్ సేన్‌ను అర్జున్ విలక్షణమైన పాత్రలో చూపించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడంతో చిత్ర యూనిట్ సినిమా ప్రయాణం త్వరలో ప్రారంభించబోతుంది.

Tags:    
Advertisement

Similar News