సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజీనామా లేఖ‌ !

ఎవరైనా తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తే రెస్పెక్టెడ్ సర్ నుంచి మొదలుపెట్టి అప్పటి వరకు తను పని చేసి ఆ కంపెనీ ఎంత గొప్పదో… తనకు అవకాశం ఇచ్చి తనకెంత మేలు చేసిందో…తను కంపెనీ నుంచి వెళ్ళిపోవడం ఎంత అయిష్టంగా తీసుకుంటున్న నిర్ణయమో…ఇలా ఎన్నో పేరాలు నింపి చివరకు తాను రాజీనామా చేస్తున్నట్టు చెప్తారు చాలా మంది. అయితే ఇప్పుడు ఓ రిజిగ్నేషన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత వైరల్ అవడానికి ఆ లెటర్ […]

Advertisement
Update: 2022-06-16 06:10 GMT

ఎవరైనా తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తే రెస్పెక్టెడ్ సర్ నుంచి మొదలుపెట్టి అప్పటి వరకు తను పని చేసి ఆ కంపెనీ ఎంత గొప్పదో… తనకు అవకాశం ఇచ్చి తనకెంత మేలు చేసిందో…తను కంపెనీ నుంచి వెళ్ళిపోవడం ఎంత అయిష్టంగా తీసుకుంటున్న నిర్ణయమో…ఇలా ఎన్నో పేరాలు నింపి చివరకు తాను రాజీనామా చేస్తున్నట్టు చెప్తారు చాలా మంది. అయితే ఇప్పుడు ఓ రిజిగ్నేషన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత వైరల్ అవడానికి ఆ లెటర్ లో ఎముందనుకుంటున్నారా ? అది 9 అక్షరాల రాజీనామా లేఖ. ప్రపంచంలో ఇంత చిన్న రాజీనామా లేఖ ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు.

ఏమాత్రం సమయాన్ని , స్థలాన్ని వృథా చేయకుండా ఆంగ్లంలో ”Bye Bye sir” అని తొమ్మిది అక్షరాలతో ఓ వ్యక్తి రాజీనామా లేఖ రాశారు. మొత్తం లేఖ ఇలా ఉంది….

Dear Sir,

RE: RESIGNATION LETTER

Bye Bye Sir

Yours Faithfully

అని రాసి కింద సంతకం చేశారు.

ఈ లేఖ నెటిజనులను బాగా ఆకర్షించింది. దీనిమీద ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక మీమ్స్ పుట్టుకొచ్చాయి. మీకు కూడా ఈ లేఖ ఆసక్తి కలిగిస్తే చూసి ఆనందించండి. కానీ ఉద్యోగంలో ట్రై చేయకండి.

Tags:    
Advertisement

Similar News