సమ్మతమే మూవీ ట్రయిలర్ రివ్యూ

సమ్మతమే సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. ఆ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ట్రయిలర్ కూడా విడుదల చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సమ్మతమే ట్రయిలర్ రిలీజైంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం 3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా కిరణ్ అబ్బవరం మేనరిజమ్స్ […]

Advertisement
Update: 2022-06-16 10:33 GMT

సమ్మతమే సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. ఆ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ట్రయిలర్ కూడా విడుదల చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సమ్మతమే ట్రయిలర్ రిలీజైంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం

3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా కిరణ్ అబ్బవరం మేనరిజమ్స్ బాగున్నాయి. డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. టెక్నికల్ గా ట్రైలర్ రిచ్ గా ఉంది. సతీష్ రెడ్డి మాసం అందించిన విజువల్స్ సూపర్ కూల్ గా వున్నాయి. ట్రైలర్ కి శేఖర్ చంద్ర అందించిన బీజీయం చాలా రీఫ్రెషింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఈ ట్రైలర్, సినిమా పై అంచనాలు పెంచింది.

“సమ్మతమే” చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. యుజి ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News