అప్పులు తీరుస్తా.. మంచి ఫుడ్ తింటా : కమల్ హాసన్

విశ్వనాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నారు. గత నాలుగేళ్లుగా ఒక్క సినిమా లేక, రాజకీయాల్లో బిజీ అయిపోయి అభిమానులకు దూరమయ్యారు. అయితే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్’ సినిమా అతడి ఫేట్ పూర్తిగా మార్చేసింది. మళ్లీ పాత కమల్ క్రేజ్‌ను ముందుకు తీసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసి కమల్‌కు కనకవర్షం కురిపించింది. ఈ సినిమా విజయోత్సవ విశేషాలు పంచుకునే సమయంలో కమల్ కొన్ని […]

Advertisement
Update: 2022-06-15 06:30 GMT

విశ్వనాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నారు. గత నాలుగేళ్లుగా ఒక్క సినిమా లేక, రాజకీయాల్లో బిజీ అయిపోయి అభిమానులకు దూరమయ్యారు. అయితే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్’ సినిమా అతడి ఫేట్ పూర్తిగా మార్చేసింది. మళ్లీ పాత కమల్ క్రేజ్‌ను ముందుకు తీసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసి కమల్‌కు కనకవర్షం కురిపించింది. ఈ సినిమా విజయోత్సవ విశేషాలు పంచుకునే సమయంలో కమల్ కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు ముందు తాను అప్పుల్లో ఉన్నానని, తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌లో పనిచేసే వారికి సరైన సమయానికి జీతాలివ్వలేక పోయానన్నారు. తనకు ఇష్టమైన ఆహారాన్ని కూడా తినలేకపోయానని చెప్పుకొచ్చారు. అప్పట్లో నేను అప్పుల్లో ఉన్నప్పుడు రూ. 300 కోట్లు సంపాదిస్తానని చెబితే ఒక్కరూ నమ్మలేదని, కానీ ఈ రోజు ఆ విషయం నిజమైందని కమల్ చెప్పారు.

‘ఎవరికైనా డబ్బు చాలా ముఖ్యం. జీవితంలో అభివృద్ది చెందడానికే కాకుండా.. మనల్ని నమ్ముకున్న వారికి సాయం చేయడానికి డబ్బు కావాలి. అప్పట్లో రూ. 300 కోట్లు సంపాదిస్తానంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు నిజమైంది. ఈ డబ్బుతో నా అప్పులన్నీ తీర్చేస్తా. కుటుంబం, సన్నిహితులకు ఆర్థికంగా అండగా ఉంటా. నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయిన తర్వాత మాత్రం.. సాయం చేయలేనని చెప్పేస్తా’ అని కమల్ అన్నారు.

నేను ఎప్పుడూ పక్కవాళ్ల దగ్గర డబ్బు తీసుకొని సాయం చేయాలని అనుకోలేదని.. ఒక మంచి వ్యక్తిగా మాత్రమే ఉండాలని అనుకున్నానని కమల్ అన్నారు. కాగా, కమల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇండియన్-2 సినిమా పలు కారణాల వల్ల ఆగిపోయింది. ఆ సినిమా దర్శకుడు శంకర్ వేరే సినిమా చూసుకోగా.. కమల్ తన సొంత బ్యానర్‌పై విక్రమ్ నిర్మించారు. విక్రమ్ విజయం ఇచ్చిన ఊపుతో ఇండియన్-2ను కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని కమల్ భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News