అమ్మగారి ఆవుకి జ్వరమొచ్చింది.. ఏడుగురు డాక్టర్లకు డ్యూటీ పడింది..

ఇటీవల ఢిల్లీకి చెందిన ఐఏ­ఎస్‌ అధి­కారుల జంట పెంపుడు కుక్కలతో కలసి వాకింగ్ చేసేందుకు వీలుగా కొంతమంది సిబ్బంది సెక్యూరిటీగా రావడం, సమయానికి ముందుగానే స్పోర్ట్స్ స్టేడియం ఖాళీ చేయించడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆ వ్యవహారం మరింత ముదిరి ఐఏఎస్ ల బదిలీలకు కారణమైంది. ఆమధ్య తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఐఏఎస్ అధికారి టెన్నిస్ ఆడే సమయంలో బాల్ అందించేందుకు బాల్ బాయ్స్ గా వీఆర్ఏలకు డ్యూటీలు వేశారు. రోజుకి ముగ్గురు చొప్పున వారానికి 21మంది […]

Advertisement
Update: 2022-06-12 11:17 GMT

ఇటీవల ఢిల్లీకి చెందిన ఐఏ­ఎస్‌ అధి­కారుల జంట పెంపుడు కుక్కలతో కలసి వాకింగ్ చేసేందుకు వీలుగా కొంతమంది సిబ్బంది సెక్యూరిటీగా రావడం, సమయానికి ముందుగానే స్పోర్ట్స్ స్టేడియం ఖాళీ చేయించడం వివాదాస్పదమైంది.

ఆ తర్వాత ఆ వ్యవహారం మరింత ముదిరి ఐఏఎస్ ల బదిలీలకు కారణమైంది. ఆమధ్య తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఐఏఎస్ అధికారి టెన్నిస్ ఆడే సమయంలో బాల్ అందించేందుకు బాల్ బాయ్స్ గా వీఆర్ఏలకు డ్యూటీలు వేశారు. రోజుకి ముగ్గురు చొప్పున వారానికి 21మంది వీఆర్ఏలకు డ్యూటీలు వేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వీటన్నింటినీ తలదన్నే సంఘటన ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

ఉత్తర ప్రదేశ్ ఫతే­పూర్ జిల్లా కలెక్టర్ అను­ప్రియ దూబే ఓ ఆవుని పెంచుకుంటారు. ఆమెకు ఆ ఆవు అంటే పంచ ప్రాణాలు. ప్రతి రోజూ ఆవుకి గడ్డి వేయడం, నీళ్లు పెట్టడం ఆమె దగ్గరుండి పర్యవేక్షించేవారు. ప్రత్యేకంగా ఆవు యోగక్షేమాలు చూసేందుకు ఇద్దరు సిబ్బందిని కూడా నియమించుకున్నారు.

అయితే ఇటీవల ఆవు అనారోగ్యానికి గురైంది. సహజంగా ఎవరైనా పశువైద్యులకు చూపిస్తారు, మందులు వాడి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆమె ఐఏఎస్ కదా, పైగా జిల్లా కలెక్టర్ కూడా.. ఇంకేముంది.. జిల్లాలో నిపుణులైన ఏడుగురు పశు వైద్యులకు ఆదేశాలు వెళ్లాయి.

ఆవు చికిత్సకోసం ఏడుగురికి షిఫ్ట్ ల వారీగా డ్యూటీలు వేశారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆవును పరి­శీ­లించి, అమ్మగారికి నివే­దికలు ఇవ్వడం వారి పని. చీఫ్ వెటర్నరీ ఆఫీసర్.. వెటర్నరీ డాక్టర్లకు డ్యూటీలు వేయడంతో.. ఆ విషయం వైరల్ గా మారింది. ఆయన జారీ చేసిన ఆదేశాల కాపీ సోషల్ మీడియాలో కలకలం రేపింది.

యూపీలో ఇది కామన్ గా జరిగేదే కావొచ్చు కానీ, సోషల్ మీడియా పాపులర్ అయ్యాక, ఇలాంటి విషయాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ఐఏఎస్ ల అధికార దుర్వినియోగాన్ని ఇలా బయటపెడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News