చార్మినార్ వద్ద ఉద్రిక్తం…దేశవ్యాప్తంగా ప్రదర్శన‌లు

మహ్మాద్‌ ప్రవక్తపై నుపూర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ‍్యల కు వ్యతిరేకంగా ఇవ్వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన‌లు జరిగాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నమాజు అయిపోయిన తర్వాత వేలాది మంది ముస్లింలు ప్రదర్శ‌నలు నిర్వహించారు. నిరసనలతో హైదరాబాద్, చార్మినార్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మక్కా మసీదులో ప్రార్దనల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మక్కా మసీద్‌ నుంచి చార్మినార్‌ వరకు నిరసనకారులు ర్యాలీ తీశారు. ముందుగానే పరిస్థితిని […]

Advertisement
Update: 2022-06-10 04:56 GMT

మహ్మాద్‌ ప్రవక్తపై నుపూర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ‍్యల కు వ్యతిరేకంగా ఇవ్వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన‌లు జరిగాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నమాజు అయిపోయిన తర్వాత వేలాది మంది ముస్లింలు ప్రదర్శ‌నలు నిర్వహించారు.

నిరసనలతో హైదరాబాద్, చార్మినార్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మక్కా మసీదులో ప్రార్దనల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మక్కా మసీద్‌ నుంచి చార్మినార్‌ వరకు నిరసనకారులు ర్యాలీ తీశారు. ముందుగానే పరిస్థితిని అంచనావేసిన పోలీసులు భారీ సంఖ్యలో బలగలాను మోహరించారు.

కాగా ఢిల్లీ జామా మసీద్‌ వద్ద కూడా ప్రదర్శన‌లతో ఉద్రిక్తత నెలకొంది. నమాజు ముగిసిన వెంటనే వందల మంది బైటికి వచ్చి బీజేపీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ప్రదర్శనతో తమకు ఎలాంటి సంబంధం లేదని జామా మసీద్‌ నిర్వాహకులు తెలిపారు.

మరో వైపు అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు వేలాది మందితో నిరసన ప్రదర్శనలు జరిగాయి. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రదర్శన‌కారులు నినాదాలు చేశారు.

Tags:    
Advertisement

Similar News