కాశ్మీర్ సమస్యను హ్యాండిల్ చేయడం బీజేపీకి చేతకాదు : కేజ్రివాల్

కాశ్మీర్ పండిట్లు మరో సారి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతున్నారని, టార్గెటెడ్ కిల్లింగ్స్ కారణంగానే మళ్లీ పాత సమస్య మొదలయ్యిందని.. కేంద్రం వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాశ్మీర్ సమస్యను బీజేపీ హ్యాండిల్ చేయలేదని.. వాళ్లకి డర్టీ పాలిటిక్స్ చేయడం తప్ప మరేమీ తెలియదని ఆయన విమర్శించారు. కాశ్మీర్ విషయంలో రాజకీయాలు చేయవద్దని బీజేపీకి ఆయన హితవు పలికారు. కాశ్మీర్ టార్గెటెడ్ కిల్లింగ్స్‌కు నిరసనగా ఆమ్ […]

Advertisement
Update: 2022-06-05 04:36 GMT

కాశ్మీర్ పండిట్లు మరో సారి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతున్నారని, టార్గెటెడ్ కిల్లింగ్స్ కారణంగానే మళ్లీ పాత సమస్య మొదలయ్యిందని.. కేంద్రం వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాశ్మీర్ సమస్యను బీజేపీ హ్యాండిల్ చేయలేదని.. వాళ్లకి డర్టీ పాలిటిక్స్ చేయడం తప్ప మరేమీ తెలియదని ఆయన విమర్శించారు. కాశ్మీర్ విషయంలో రాజకీయాలు చేయవద్దని బీజేపీకి ఆయన హితవు పలికారు.

కాశ్మీర్ టార్గెటెడ్ కిల్లింగ్స్‌కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘జన్ ఆక్రోశ్ ర్యాలీ’లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 1990ల్లో కాశ్మీర్ నుంచి పండిట్లు బలవంతంగా ఆ ప్రాంతాన్ని వదిలి వేసి వెళ్లారు. ఆనాటి పరిస్థితులో తిరిగి ఇవాళ కూడా కనపడుతున్నాయన్నారు. కాశ్మీర్ విషయంలో కేంద్రం ఏం చేయబోతున్నదో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ చెప్పారు. కాశ్మీర్ వెలుపల పని చేయమని రాయించుకుంటున్న బాండ్లను రద్దు చేయాలని, వారి డిమాండ్లు అన్నింటినీ నెరవేర్చడమే కాకుండా తగిన రక్షణ కూడా కల్పించాలని కేజ్రీవాల్ కోరారు.

మరోవైపు పాకిస్తాన్ కూడా కాశ్మీర్‌లో తమ కుయుక్తులను ఆపాలని కేజ్రీవాల్ అన్నారు. ఆ ప్రాంతం ఎప్పటికీ ఇండియాలో భాగంగానే ఉంటుందని కేజ్రీవాల్ చెప్పారు. కాశ్మీర్ విషయంలో భారతీయులందరూ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉంటారని ఆయన గుర్తు చేశారు.

Advertisement

Similar News