విషయం అర్థమైంది.. టికెట్లపై అల్లు అరవింద్ కామెంట్స్
మొన్నటి వరకు సినిమా టికెట్ల ధరలు పెంచాలంటూ, ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను దెబ్బతీసేందుకే టికెట్ల ధరలు తగ్గించిందంటూ చిత్ర పరిశ్రమ పెద్దలు గగ్గోలు పెట్టారు. చివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు… మీ చావు.. మీరు చావండి అంటూ సినిమా టికెట్ల ధరలను పెంచుతూ జీవోలు ఇచ్చాయి. ఇప్పుడు చిత్ర పరిశ్రమకు అసలు విషయం బోధపడింది. సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచేయడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలన్న ఆలోచన చాలా మంది […]
మొన్నటి వరకు సినిమా టికెట్ల ధరలు పెంచాలంటూ, ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను దెబ్బతీసేందుకే టికెట్ల ధరలు తగ్గించిందంటూ చిత్ర పరిశ్రమ పెద్దలు గగ్గోలు పెట్టారు. చివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు… మీ చావు.. మీరు చావండి అంటూ సినిమా టికెట్ల ధరలను పెంచుతూ జీవోలు ఇచ్చాయి. ఇప్పుడు చిత్ర పరిశ్రమకు అసలు విషయం బోధపడింది.
సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచేయడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలన్న ఆలోచన చాలా మంది మానేశారు. ఏదో అద్భుతమైన గ్రాఫిక్స్ సినిమా అయితే తప్పించి… స్టోరి బేస్ సినిమాలను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువగా ఓటీటీకి మళ్లేశారు.
ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ .. టికెట్ల ధరలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరల విషయంలో ఇండస్ట్రీ ఇటీవల పాఠాలు నేర్చుకుందని వ్యాఖ్యానించారు. ” ఈమధ్య ఇండస్ట్రీ నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే.. టికెట్ల ధరలు కొంచెం తగ్గించండి బాబు.. ఓటీటీని కొంచెం దూరం పెట్టండి బాబు.. కొన్ని వారాల తర్వాతే సినిమా ఓటీటీలో వచ్చేలా చూడండి” వంటి పాఠాలు నేర్చుకున్నామని అల్లు అరవింద్ చెప్పారు.
సినిమాను థియేటర్లలోనే చూడాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. సినిమా వెంటనే ఓటీటీలోకి వస్తే అయిపోతాం అన్న విషయం ఇండస్ట్రీకి అర్థమైందన్నారు. గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా ఫంక్షన్‌లో అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.