గాయకుడు కేకే మరణంపై అనుమానాలు

ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అతనిది సహజ మరణం కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కోల్‌కతా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు.కోల్ కతా లోని న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. “మేము గాయకుడు కెకె మరణంపై దర్యాప్తు ప్రారంభించాము. న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు నమోదు చేయబడింది. మేము హోటల్ అధికారులతో మాట్లాడుతున్నాము. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే […]

Advertisement
Update: 2022-06-01 01:49 GMT

ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అతనిది సహజ మరణం కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కోల్‌కతా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు.కోల్ కతా లోని న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

“మేము గాయకుడు కెకె మరణంపై దర్యాప్తు ప్రారంభించాము. న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు నమోదు చేయబడింది. మేము హోటల్ అధికారులతో మాట్లాడుతున్నాము. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నాము, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులను విచారించాము” అని పోలీసు అధికారి తెలిపారు.

కేకే ముఖంపై గాయాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాగా సరైన వసతులు లేకపోవడం వల్లే కేకే మరణించారని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

నజ్రుల్ ఆడిటోరియంలో ప్రదర్శన అయిపోయిన తర్వాత కేకే హోటల్ చేరుకున్నారు. అయితే అప్పటికే అనేక మంది ఆయన అభిమానులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆయన సెల్ఫీలు ఇవ్వడానికి నిరాకరించి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడని అక్కడ ఆయన పడిపోయాడని పోలీసులు చెప్తున్నారు. కిందపడ్డప్పుడు ఆయన తలకు గాయమైందని తెలుస్తోంది.

కాగా శవపరీక్ష నివేదిక వస్తే గానీ మరణానికి ఖచ్చితమైన కారణం తెలియదని పోలీసు అధికారి తెలిపారు.

మరో వైపు కేకే ప్రదర్శన ఇస్తున్న‌ సమయంలో ఆయన చాలా ఇబ్బందికి లోనయ్యారు. వేదిక క్లోజ్డ్‌ హాల్‌. ఫ్యాన్‌, ఏసీ సదుపాయాలు లేకపోవడంతో విపరీతమైన చెమటలు పోసి ఇబ్బందిపడ్డారు. ఒకానొక టైంలో భరించలేక కిందకు దిగి నిర్వాహకులకు స్వయంగా ఆయనే ఇబ్బందిపై ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ నిర్వాహకులు సరిగా స్పంధించలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కేకే చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన కేకే అభిమానులు ఆయన మరణానికి నిర్వహకుల నిర్లక్ష‍్యమే కారణం అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ‘అక్కడ ఏసీ లేదు.

వేడి, డీహైడ్రేషన్‌ వల్లే స్ట్రోక్స్‌, కార్డియాక్ అరెస్ట్‌లు సంభవిస్తాయి’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేశాడు. ‘ఆ కాన్సెర్ట్‌లో పాల్గొనకపోతే కేకే బతికి ఉండేవాడు. కేవలం ఆయన తన అభిమానుల కోసమే ప్రదర్శన ఇచ్చారు. నిర్వాహణ లోపం కారణంగా మనం ఒక రత్నాన్ని కోల్పోయాం’ అని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    
Advertisement

Similar News