ఫేస్‌బుక్‌లో మన పోస్టులు ఎవరు చూశారో తెలుసుకోవచ్చు.. అమల్లోకి కొత్త ప్రైవసీ పాలసీ

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది. ఎఫ్బీతో పాటు ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌ల ప్రైవసీ పాలసీ అప్‌డేట్ చేసినట్లు చెప్పింది. కొత్త పాలసీలో భాగంగా మన పోస్టులను ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. ఇందుకు గాను మనం కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఎవరు పోస్టులు చూస్తున్నారో తెలుసుకోవడానికి సెట్టింగ్ పెట్టుకుంటే.. మనం కూడా ఎవరి పోస్టులు చూశామో తెలుస్తుంది. అంటే వాట్సప్ గ్రూప్‌లో మనం పోస్టు పెడితే.. ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. అలాగే […]

Advertisement
Update: 2022-05-27 03:42 GMT

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది. ఎఫ్బీతో పాటు ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌ల ప్రైవసీ పాలసీ అప్‌డేట్ చేసినట్లు చెప్పింది. కొత్త పాలసీలో భాగంగా మన పోస్టులను ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. ఇందుకు గాను మనం కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఎవరు పోస్టులు చూస్తున్నారో తెలుసుకోవడానికి సెట్టింగ్ పెట్టుకుంటే.. మనం కూడా ఎవరి పోస్టులు చూశామో తెలుస్తుంది. అంటే వాట్సప్ గ్రూప్‌లో మనం పోస్టు పెడితే.. ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. అలాగే బ్లూటిక్ వచ్చేలా చేసుకోవచ్చు. అలాగే బ్లూటిక్ ఆపితే.. మనం చూసినా ఎదుటి వాళ్లకు తెలియదు. అలాగే వాళ్లు చూసినా మనకు తెలియదు. సేమ్ ఇలాంటి సెట్టింగ్సే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌కు కూడా వర్తించనున్నాయి.

ఇక కొత్త పాలసీ కింద మన పోస్టులు ఎవరెవరు చూడాలో నియంత్రణ పెట్టుకోవచ్చు. కేవలం వాళ్లే కామెంట్లు పెట్టేలా.. లైక్ చేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. ప్రైవసీ పాలసీ అప్‌డేట్ చేసినట్లు నోటిఫికేషన్లు పంపిస్తున్నట్లు ఫేస్‌బుక్ మాతృకంపెనీ మెటాతెలిపింది. మరోవైపు యూజర్ల డేటాను సేకరించడం లేదా షేర్ చేయడం బంద్ చేసినట్లు మెటా వివరించింది.

కేవలం స్నేహితులు లేదా కొలీగ్స్ లేదా బంధువులు చూసేలా గ్రూప్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు అని మెటా తమ బ్లాగ్‌లో వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News