మోడీని తిడితే ఇలాగే వదిలేస్తారా?

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వ్యవహారం నత్తనడకన సాగుతోంది. కేంద్ర పెద్దలు పరోక్షంగా రఘురామకు అండగా ఉంటున్నారని భావిస్తున్న వైసీపీ కూడా ఈ మధ్య ఈ అంశంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వైసీపీ ఇది వరకు ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై సోమవారం లోక్‌సభ సభాహక్కుల సంఘం విచారణ జరిపింది. వైసీపీ తరపున ఎంపీ భరత్ హాజరై వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రిని రోజూ రఘురామకృష్ణంరాజు తిడుతున్నారని, పార్టీని ధిక్కరించి మాట్లాడుతున్న రఘురామపై అనర్హత వేటు వేయాలని చాలాకాలం క్రితమే […]

Advertisement
Update: 2022-05-23 21:00 GMT

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వ్యవహారం నత్తనడకన సాగుతోంది. కేంద్ర పెద్దలు పరోక్షంగా రఘురామకు అండగా ఉంటున్నారని భావిస్తున్న వైసీపీ కూడా ఈ మధ్య ఈ అంశంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వైసీపీ ఇది వరకు ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై సోమవారం లోక్‌సభ సభాహక్కుల సంఘం విచారణ జరిపింది. వైసీపీ తరపున ఎంపీ భరత్ హాజరై వాదనలు వినిపించారు.

ముఖ్యమంత్రిని రోజూ రఘురామకృష్ణంరాజు తిడుతున్నారని, పార్టీని ధిక్కరించి మాట్లాడుతున్న రఘురామపై అనర్హత వేటు వేయాలని చాలాకాలం క్రితమే పిటిషన్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలెవరైనా ప్రధాని నరేంద్రమోడీని తిడితే ఇలాగే వ్యవహరిస్తారా అని నిలదీశారు. మోడీని తిట్టినా సభ్యత్వం కొనసాగిస్తారా అని ప్రశ్నించారు.

తాను పార్టీని విమర్శించడం లేదు, ప్రభుత్వ లోపాలపై మాత్రామే మాట్లాడుతున్నానంటూ రఘురామ తెలివిగా చెబుతున్నారని.. పార్టీ విధానాలు, మేనిఫెస్టో చూసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారని, ప్రభుత్వమేమీ ఆకాశం నుంచి ఊడిపడదని భరత్ వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు ప్రవర్తనకు ఫిరాయింపు నిరోధకచట్టం వర్తిస్తుందని భరత్ వాదించారు. కాబట్టి అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

భరత్‌ తనపై చేసిన విమర్శలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనపై వేటు వేయాలంటున్న వైసీపీ ప్రభుత్వం.. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం,మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌లు.. వైసీపీ పంచన చేరి , కండువాలు కప్పుకుని నిస్సిగ్గుగా తిరుగుతున్నారని.. మరి వారిపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

ALSO READ: మా రోడ్లపై తిరుగుతున్నారు.. కనీసం మోదీ ఫొటో అయినా పెట్టండి..

Tags:    
Advertisement

Similar News