స్లో ట్రావెలింగ్ చేద్దామా?

టూర్‌‌కెళ్లి చూడాల్సిన ప్రదేశాలను చూసి రావడం కాకుండా ఒక ప్రదేశాన్ని ఎంచుకుని దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఎక్కువ రోజులు గడపడాన్ని ‘స్లో ట్రావెల్’ అంటారు. ఇలాంటి ప్రయాణాలు ఒంటరిగా చేస్తే దాన్ని ‘సోలో స్లో ట్రావెలింగ్’ అంటారు.

Advertisement
Update: 2024-05-10 10:59 GMT

టూర్ అంటే ఏదో నాలుగు రోజులు సెలవు పెట్టామా.. మంచి టూరిస్ట్ స్పాట్ కెళ్లి అక్కడ ప్లేసులన్నీ గబగబా కవర్ చేసి తిరిగి ఇంటికొచ్చేశామా.. అన్నట్టు ఉంటే కుదరదంటున్నారు ఇప్పటి యూత్.. మనసు పూర్తిగా సేద తీరే వరకూ ట్రావెల్ చేయాల్సిందే అంటున్నారు. దీన్నే ఇప్పుడు ‘స్లో ట్రావెల్’ అని పిలుస్తున్నారు. ఇదెలా ఉంటుందంటే.

టూర్‌‌కెళ్లి చూడాల్సిన ప్రదేశాలను చూసి రావడం కాకుండా ఒక ప్రదేశాన్ని ఎంచుకుని దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఎక్కువ రోజులు గడపడాన్ని ‘స్లో ట్రావెల్’ అంటారు. ఇలాంటి ప్రయాణాలు ఒంటరిగా చేస్తే దాన్ని ‘సోలో స్లో ట్రావెలింగ్’ అంటారు. ఇప్పుడు అందరూ ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

సోలో స్లో ట్రావెలింగ్ ట్రిప్స్‌కు కనీసం నెల రోజుల సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ ట్రిప్స్‌లో మీతో మీరు ఎక్కువ సమయం గడపొచ్చు. వెళ్లిన ప్రతిచోటా ప్రశాంతంగా గడుపుతూ నెమ్మదిగా ప్రయాణాన్ని సాగించొచ్చు. ప్రదేశాన్ని బట్టి అక్కడి కల్చర్‌‌లో పూర్తిగా మమేకమవుతూ అక్కడివాళ్లుగా కొన్ని రోజలు బతకొచ్చు. ఇదే సోలో స్లో ట్రావెలింగ్ అంటే. మరి ఇలాంటి ట్రిప్స్ చేసేందుకు ఎలాంటి ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి?

సోలో స్లో ట్రావెలింగ్ కోసం రద్దీ ఉండే ప్రాంతాలను ఎంచుకోకూడదు. ప్రత్యేకంగా ఉంటూ కల్చరల్ హెరిటేజ్ ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలి. సెక్యూరిటీ పరంగా సేఫ్‌గా ఉండే ప్రాంతాలను ఎంచుకోవాలి. సోలో స్లో ట్రావెలింగ్ కోసం అనువైన కొన్ని బెస్ట్ ప్లేసులను ఇప్పుడు చూద్దాం.

మజూలి ఐల్యాండ్

అస్సాంలోని బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉండే మజూలి ఐల్యాండ్ ఎంతో అందమైన ప్రదేశం. ఈ ప్రాంతం నీటి మధ్యలో ఉంటుంది. పడవల్లో అక్కడికి చేరుకోవాలి. ఇదొక గిరిజన ప్రాంతం. సోలో స్లో ట్రావెల్ చేయడానికి ఇదొక ప్రత్యేకమైన ప్లేస్.

మెచూకా

అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న మెచూకా అనే ప్రాంతం కూడా సోలో స్లో ట్రావెలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది కొండల మధ్యన ఉండే మారుమూల గ్రామం. ప్రపంచంలో సంబంధం లేకుండా ప్రశాతంగా కొన్ని రోజులు గడిపేందకు ఇది పర్ఫెక్ట్ ప్లేస్.

 

అండమాన్ ఐలాండ్స్

నెమ్మదిగా ఎక్కువ రోజుల పాటు ట్రావెల్ చేసేందుకు అండమాన్ ఐలాండ్స్ అనువుగా ఉంటాయి. ఇక్కడ ఉండే రకరకాల ఐలాండ్స్‌లో వీలైనన్ని రోజులు గడుపుతూ ఆ ప్రాంతమంతా తిరగొచ్చు. సోలో స్లో ట్రావెల్ చేయాలనుకునే బీచ్ లవర్స్ ఈ ప్లేస్ ట్రై చేయొచ్చు.

 

ఇవి కూడా..

మరింత సేఫ్‌గా సోలో స్లో ట్రావెలింగ్ చేయాలనుకునేవాళ్లు కొన్ని పాపులర్ రిసార్ట్స్, ఫార్మ్స్ వంటి వాటిని కూడా ఎంచుకోవచ్చు. వీటిలో కొన్ని ఇవి

గ్లెన్‌బర్న్ టీ ఎస్టేట్

డార్జిలింగ్‌లో ఉన్న గ్లెన్‌బర్న్ టీ ఎస్టేట్.. టౌన్‌కు దూరంగా.. అన్ని రకాల వసతులతో సోలో స్లో ట్రావెలింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. ఇక్కడ స్టే చేస్తూ డార్జిలింగ్ ప్రాంతాన్ని ఎక్కువ రోజులు ఆస్వాదించొచ్చు.

 

నార్త్ ఎస్టేట్

హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ఉన్న నార్త్ ఎస్టేట్ గెస్ట్ హౌస్.. సోలో స్లో ట్రావెలింగ్ కు బెస్ట్ ప్లేస్. ఇది కూడా టౌన్‌కు దూరంగా ఉంటూ రిమోట్ ప్లేస్‌లో ఉన్న అనుభూతినిస్తుంది. అన్ని రకాల వసతులతో సోలో ట్రావెలర్స్‌కు అనుకూలంగా ఉంటుంది.

క్రాంగనోర్ కేఫ్

కేరళలోని పెరియార్ నది ఒడ్డున ఉండే క్రాంగనోర్ హిస్టరీ కేఫ్.. సోలో స్లో ట్రావెలర్స్‌కు బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఇక్కడ ఉంటూ కేరళ బ్యాక్ వాటర్, అరేబియా సముద్రపు అందాల్ని ఆస్వాదించొచ్చు.

Tags:    
Advertisement

Similar News