ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు పేలుతున్నాయంటే..?

దేశవ్యాప్తంగా ఇటీవల ఎలక్ట్రిక్ టూవీలర్స్ పేలిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. వరుస అగ్ని ప్రమాదాలతో బైక్ యజమానులతోపాటు ఆయా కంపెనీల యాజమాన్యాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంధన వినియోగం తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కూడా ప్రమాదాలపై దృష్టిపెట్టింది. ఓ ఉన్నత స్థాయి కమిటీతో ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై విచారణ చేపట్టింది. ఈ కమిటీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో కారణాలన్నీ బ్యాటరీల నిర్వహణ లోపాలను ఎత్తి చూపుతున్నాయి. […]

Advertisement
Update: 2022-05-12 04:37 GMT

దేశవ్యాప్తంగా ఇటీవల ఎలక్ట్రిక్ టూవీలర్స్ పేలిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. వరుస అగ్ని ప్రమాదాలతో బైక్ యజమానులతోపాటు ఆయా కంపెనీల యాజమాన్యాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంధన వినియోగం తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కూడా ప్రమాదాలపై దృష్టిపెట్టింది. ఓ ఉన్నత స్థాయి కమిటీతో ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై విచారణ చేపట్టింది. ఈ కమిటీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో కారణాలన్నీ బ్యాటరీల నిర్వహణ లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ప్రమాదాలపై ప్రాథమిక సమాచారం, అక్కడినుంచి సేకరించిన నమూనాలు, ఆయా కంపెనీలనుంచి సేకరించిన వివరాల ప్రకారం కమిటీ ప్రాథమిక నివేదిక తయారు చేసింది.

బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ లో ఉన్న లోపాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్టు కేంద్ర కమిటీ పేర్కొంది. ఒకినావా కంపెనీకి చెందిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ప్ర‌మాదానికి బ్యాట‌రీ సెల్స్‌, మాడ్యూల్స్ కార‌ణ‌మ‌ని పేర్కొంది. ప్యూర్ ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన వాహనాల ప్రమాదంలో బ్యాట‌రీ కేసింగ్‌ లో లోపాలు బయటపడ్డాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఇటీవల ప్రమాదాలకు గురయ్యాయి. నిర్వహణ లోపాలు సవరించేందుకు ఓలా కంపెనీ కొన్ని మోడల్స్ ని వెనక్కి తెప్పించుకుంది కూడా. ఓలా కంపెనీ స్కూటర్లలో బ్యాట‌రీ మేనేజ్‌ మెంట్ సిస్ట‌మ్‌ లో లోపాలు ఉన్న‌ట్లు క‌మిటీ అధ్య‌య‌నంలో తేలింది. ఐసోలేటెడ్ థ‌ర్మ‌ల్ ఇష్యూ కార‌ణంగా ఓలా స్కూట‌ర్లు అగ్ని ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నాయ‌ని ఆ నివేదిక స్ప‌ష్టం చేసింది.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అగ్ని ప్రమాదాలకు కారణాలను విశ్లేషిస్తున్న కేంద్ర కమిటీ.. మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత తుది నివేదిక బయటపెడుతుంది. మరో రెండు వారాల్లో తుది నివేదిక వస్తుంది. మరోవైపు ఆయా కంపెనీలు కూడా అగ్ని ప్రమాదాలపై దృష్టిసారించాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ దాదాపుగా సగానికి పడిపోయాయి. వాహనదారులకు భరోసా కల్పించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వాహనాలు, బ్యాటరీల సామర్థ్యాన్ని మరోసారి పరీక్షిస్తున్నాయి.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 80 శాతం వాహ‌నాల‌ను ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌ తో రీప్లేస్ చేయాల‌నే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అయితే ప్రమాదాల కారణంగా కేంద్రం కూడా పునరాలోచనలో పడింది. కంపెనీలు ఏవయినా.. ప్రమాదాలు మాత్రం కామన్ గా జరుగుతుండటంతో.. లోపాలను కనిపెట్టే పనిలో పడింది. కేంద్రం నియమించిన కమిటీ పూర్తి స్థాయి నివేదిక విడుదల చేసిన తర్వాత ఆయా కంపెనీలకు కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News