హంగ్ కి అవకాశం లేదు.. 4చోట్ల బీజేపీ.. పంజాబ్ లో ఆప్..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. యూపీలో బీజేపీ, పంజాబ్ లో ఆప్, మిగతా చోట్ల హంగ్ కి అవకాశముంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. ఆ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయం స్పష్టమైపోయింది. యూపీలో బీజేపీ హవా.. ఉత్తర ప్రదేశ్ లో మళ్లీ యోగి సీఎం పీఠం ఎక్కబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే ఇక్కడ బీజేపీకి మళ్లీ అధికారం దక్కింది. అయితే యోగి ఆధిపత్యం మాత్రం తగ్గింది. […]

Advertisement
Update: 2022-03-10 03:41 GMT

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. యూపీలో బీజేపీ, పంజాబ్ లో ఆప్, మిగతా చోట్ల హంగ్ కి అవకాశముంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. ఆ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయం స్పష్టమైపోయింది.

యూపీలో బీజేపీ హవా..
ఉత్తర ప్రదేశ్ లో మళ్లీ యోగి సీఎం పీఠం ఎక్కబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే ఇక్కడ బీజేపీకి మళ్లీ అధికారం దక్కింది. అయితే యోగి ఆధిపత్యం మాత్రం తగ్గింది. 2017 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 297 స్థానాల బలం ఉండగా.. ఈసారి మిత్రపక్షాలతో కలిపినా 270 స్థానాలకంటే తక్కువే లెక్క తేలుతున్నాయి. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ బలం రెండింతలైంది. అయినా అధికారం యోగీదే కావడంతో అక్కడ బీజేపీకి పరువు దక్కింది. యోగీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే వార్తలొచ్చినా చివరకు ప్రజలు బీజేపీకే పట్టం కట్టడం విశేషం.

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ..
పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ తొలిసారిగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆమ్ ఆద్మీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఇక నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్న బీజేపీ, పంజాబ్ లో సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతోంది.

ఉత్తరాఖండ్ లో బీజేపీ సొంతగా మెజార్టీ మార్కు సాధించబోతోంది. మణిపూర్ లో వైరివర్గానికి అవకాశం లేకుండా పోవడంతో.. బీజేపీ మిత్ర పక్షాలతో కలసి అధికార పీఠం ఎక్కబోతోంది. గోవాలో హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. కాంగ్రెస్, తృణమూల్ కలసినా అక్కడ బీజేపీని వెనక్కి నెట్టే పరిస్థితి లేదు. మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ శిబిరంలో సంతోషాన్ని నింపాయి. ఆమ్ ఆద్మీ కి పంజాబ్ లో కూడా చోటు దక్కింది.

Tags:    
Advertisement

Similar News