పంజాబ్ లో ఉచితాలు.. స్టూడెంట్స్ కి స్కూటీలు.. గృహిణులకు సిలిండర్లు..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అధిష్టానం. ఈ దశలో పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మహిళలపై వరాల జల్లు కురిపించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు 2వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ప్రతినెలా ఠంచనుగా ఒకటో తేదీ జీతం ఇచ్చినట్టు గృహిణులకు సాయం చేస్తామన్నారాయన. అంతే కాదు.. ఏడాదికి 8 వంట గ్యాస్ సిలిండర్లను […]

Advertisement
Update: 2022-01-03 21:32 GMT

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అధిష్టానం. ఈ దశలో పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మహిళలపై వరాల జల్లు కురిపించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు 2వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ప్రతినెలా ఠంచనుగా ఒకటో తేదీ జీతం ఇచ్చినట్టు గృహిణులకు సాయం చేస్తామన్నారాయన. అంతే కాదు.. ఏడాదికి 8 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

ఆప్ కి పోటీగా దూకుడు..
పంజాబ్ లో పాగా వేయాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇటీవల అక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. నేరుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటిస్తూ దేశ రాజధాని మోడల్ ని పంజాబ్ లో ప్రవేశ పెడతామంటున్నారు. గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు. గృహిణులకు నెలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. దీనికి పోటీగా ఇప్పుడు సిద్ధూ భారీ హామీలు గుప్పించారు. ఆర్థిక సాయం 2వేలు అన్నారు, 8 సిలిండర్లు ఉచితం అంటున్నారు.

విద్యార్థినులకు స్కూటీలు..
ఈ దఫా పంజాబ్ లో మహిళా ఓటర్లను టార్గెట్ చేసుకున్నారు సిద్ధూ. 5వ తరగతి పాస్ అయిన విద్యార్థినులకు 5వేల రూపాయల తక్షణ సాయం అందిస్తామన్నారు. 10వ తరగతి పాస్ అయితే 15వేల రూపాయలు. 12 నుంచి పై తరగతులు పాస్ అయిన వారికి ఏకంగా రూ.20వేలు ప్రోత్సాహకాలిస్తామన్నారు. కాలేజీలో అడ్మిషన్ పొందే ప్రతి విద్యార్థినికి స్కూటీ ఇస్తామని కూడా వాగ్దానం చేశారు. విద్యార్థినులకు ఉచితంగా కంప్యూటర్లు ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకోసం 28 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తమ్మీద ఒక్క రోజులోనే సిద్ధూ తన వాగ్దానాలతో పంజాబ్ లో తీవ్ర కలకలం రేపారు. స్టూడెంట్స్ కి స్కూటీలు, గృహిణులకు గ్యాస్ సిలిండర్లు అంటూ సంచలన హామీలిచ్చేశారు.

Advertisement

Similar News