నకిలీ వ్యాక్సిన్లతో జాగ్రత్త!

కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లలో కూడా నకిలీవి వచ్చేశాయి. ఒకపక్క కరోనా మరోసారి విజృంభస్తుంటే మరో పక్క నకిలీ వ్యాక్సిన్ల దందా భయపెడుతోంది. ఈ నకిలీ వ్యాక్సిన్లను ఎలా గుర్తించాలంటే.. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలలో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ అమ్మకాలు జరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. నకిలీ టీకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వ్యాక్సిన్లను గుర్తించడానికి కొన్ని గైడ్ లైన్స్ కూడా రూపొందించింది. […]

Advertisement
Update: 2021-09-07 00:51 GMT

కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లలో కూడా నకిలీవి వచ్చేశాయి. ఒకపక్క కరోనా మరోసారి విజృంభస్తుంటే మరో పక్క నకిలీ వ్యాక్సిన్ల దందా భయపెడుతోంది. ఈ నకిలీ వ్యాక్సిన్లను ఎలా గుర్తించాలంటే..

ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలలో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ అమ్మకాలు జరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. నకిలీ టీకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వ్యాక్సిన్లను గుర్తించడానికి కొన్ని గైడ్ లైన్స్ కూడా రూపొందించింది. భారత్ కూడా నకిలీ వ్యాక్సిన్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి టీకాలలో ఏవి అసలైనవి, ఏవి నకిలీవో గుర్తించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు కొన్ని పారామీటర్స్ లిస్టును పంపింది.
మనదేశంలో మూడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు టీకాలు అసలైనవో కాదో గుర్తించాలంటే ఇలా చెక్ చేయాలి.

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. కోవిడ్-19 వ్యాక్సిన్లలో అసలైన వాటికి లేబుల్.. డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. టీకాలపై ట్రేడ్ మార్క్ తో బ్రాండ్ పేరు స్పష్టంగా రాసి ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా తెల్లని సిరాతో ముద్రించబడి ఉంటాయి. ప్రతి ఒరిజినల్ టీకాకు SII లోగో కచ్చితంగా ఉంటుంది. అలాగే ఒరిజినల్ టీకాలపై హలోగ్రామ్ కూడా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News